రాబోతున్న సామ్‌సంగ్ చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు ఇవే?

Posted By:

సామ్‌సంగ్ నుంచి ఈ నెలలో విడుదల కాబోతున్న రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఆసక్తికర సమాచారం వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ ఇంకా గెలాక్సీ ఏస్3 మోడళ్లలో విడుదలయ్యే అవకాశముందని ప్రముఖ ఆండ్రాయిడ్ బ్లాగ్ వెలువరించింది. గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ ఇప్పటికే ట్రెండ్ IIడ్యుయోస్ పేరుతో చైనా మార్కెట్లో విక్రయిస్తోంది. ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ ధర ఇంచుమించుగా రూ.8,000 వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాల అంచనా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

రాబోతున్న సామ్‌సంగ్ చవక ధర స్మార్ట్‌ఫోన్‌లు ఇవే?

గెలాక్సీ ట్రెండ్ డ్యుయోస్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 4జీబి రోమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీ సామర్ధ్యాన్ని విస్తరించుకునే సౌలభ్యత, 3 మెగా పిక్సల్ కెమెరా సెన్సార్, డ్యూయల్ సిమ్ సపోర్ట్. ఇతర స్పెసిఫికేషన్‌లకు సంబంధించి పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

మరో డివైజ్ గెలాక్సీ ఏస్ 3కి సంబంధించిన స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

4 అంగుళాల WVGA డిస్‌ప్లే (రిసల్యూషన్ 480 x 800పిక్సల్స్), 1జీబి ర్యామ్, 4జీబి రోమ్, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబికి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 5 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ క్వాలిటీ ఫ్రంట్ కెమెరా, 3జీ, వై-ఫై, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం, బ్లూటూత్ 4.0 కనెక్టువిటీ, 1500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఫోన్ ధర అంచనా రూ.15,999.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot