Home
Mobile

రేపే గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ 2026 ఈవెంట్‌.. ఏయే ఉత్పత్తులు లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది?

Galaxy Unpacked 2026 : శాంసంగ్‌ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్‌ బుధవారం (ఫిబ్రవరి 25) జరగనుంది. కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలో 10 AM PT / 1PM ET అంటే భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు ప్రారంభం కానుంది. ఈ ఈవెంట్‌లను samsung.com, శాంసంగ్ న్యూస్‌రూం, శాంసంగ్‌ యూట్యూబ్‌ ఛానల్‌ ద్వారా వీక్షించవచ్చు.

గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్‌లో గెలాక్సీ S26 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్లతోపాటు గెలాక్సీ బడ్స్‌ 4 సిరీస్‌ కూడా లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు. గెలాక్సీ S26 సిరీస్‌లో గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్‌, గెలాక్సీ S26 అల్ట్రా మోడల్స్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

samsung Galaxy unpacked 2026

దీంతోపాటు గెలాక్సీ బడ్స్‌ 4 సిరీస్‌లో భాగంగా గెలాక్సీ బడ్స్‌ 4, బడ్స్‌ 4 ప్రో విడుదలయ్యే అవకాశం ఉంది. ఇటీవలే స్మార్ట్‌ఫోన్లతోపాటు బడ్స్‌ వివరాలు లీక్‌ అయ్యాయి. అయితే శాంసంగ్‌ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

శాంసంగ్‌ గెలాక్సీ S26 సిరీస్! :
శాంసంగ్ గెలాక్సీ S26, S26 ప్లస్‌ మోడల్స్‌ Exynos 2600 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే అల్ట్రా వేరియంట్ స్నాప్‌‌డ్రాగన్‌ 8 ఇలైట్‌ జెన్‌ 5 చిప్‌సెట్‌తో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8.5 పైన పనిచేస్తుందని భావిస్తున్నారు.

బ్యాటరీ, ఛార్జింగ్ విషయానికి వస్తే గెలాక్సీ S26 హ్యాండ్‌సెట్‌ 4200mAh బ్యాటరీ, గెలాక్సీ S26 ప్లస్‌ మోడల్‌ 4800mAh బ్యాటరీతో పనిచేసే అవకాశం ఉంది. అదే అల్ట్రా వేరియంట్‌ 5000mAh బ్యాటరీతో పనిచేస్తుందని అంచనా వేస్తున్నారు.

* గెలాక్సీ S26, గెలాక్సీ S26 ప్లస్‌ మోడల్స్‌ ట్రిపుల్‌ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో OIS సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్‌ జూమ్ సపోర్టుతో 10MP టెలిఫోటో లెన్స్‌, 12MP అల్ట్రావైడ్‌ లెన్స్‌తో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 12MP కెమెరాను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.

అల్ట్రా వేరియంట్‌ మాత్రం నాలుగు కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో OIS సపోర్టుతో 200MP ప్రైమరీ, 50MP అల్ట్రావైడ్, 5x ఆప్టికల్‌ జూమ్‌తో 50MP పెరిస్కోప్‌ టెలిఫోటో లెన్స్‌, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌ ఉంటుందని తెలుస్తోంది.

గెలాక్సీ S26 మోడల్‌ 6.3 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, అదే ప్లే మోడల్‌ 6.7 అంగుళాల QHD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లే, అల్ట్రా వేరియంట్ 6.9 అంగుళాల డైనమిక్‌ అమోలెడ్‌ 2x డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై శాంసంగ్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2026 ఈవెంట్‌లో విడుదల కానున్న ఉత్పత్తులకు సంబంధించిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌లు ప్రారంభం అయ్యాయి. అయితే ఈ ఫోన్‌లు, ఇయర్‌బడ్స్‌ శాంసంగ్‌ ఇండియా ఆన్‌లైన్‌ స్టోర్‌తోపాటు అమెజాన్, ఫ్లి్‌ప్‌కార్ట్‌లో అందుబాటులోకి రానున్నాయని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
samsung Galaxy unpacked 2026 set to tomorrow galaxy S26 series, buds 4 series likely to debut
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X