మోటరోలా డెఫీకి ధీటుగా శ్యామ్‌సంగ్ ఎక్స్‌కవర్

Posted By: Staff

మోటరోలా డెఫీకి ధీటుగా శ్యామ్‌సంగ్ ఎక్స్‌కవర్

శ్యామ్‌సంగ్ గెలాక్సీ సిరిస్ ఫోన్స్‌కి మార్కెట్లో ఎంత గిరాకీ ఉందో అందరికి తెలిసిందే. దీనిని క్యాష్ చేసుకునేందుకు శ్యామ్‌సంగ్ గెలాక్సీ సిరిస్ క్రింద మరో మొబైల్‌ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. దాని పేరు శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ మొబైల్ లెటేస్ట్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో రన్ అవుతుంది. మార్కెట్లో విడుదలైన శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ మొబైల్ మోటరోలా డెఫీ మోడల్‌కి కాంపిటేషన్‌గా నిలుస్తుంది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ మొబైల్‌ని ఎలా వాడినా కూడా చెక్కుచెదరని ఫోన్‌గా మొబైల్ నిపుణులు అభివర్ణిస్తున్నారు.

ఐపి67 సర్టిఫికెట్ పొందినటువంటి మొబైల్స్‌లలో శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ ఒకటి. సాధారణంగా ఐపి67 సర్టిఫికెట్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఐపి67 సర్టిఫికెట్ ఇచ్చిన మొబైల్స్ పవర్ పుల్ బాడీని కలిగి ఉండడంతో పాటు, ఎటువంటి క్లిష్ట పరిస్దతులనైనా ఎదుర్కోనగలిగే సత్తా వాటికి ఉంది. క్లిష్ట పరిస్దితులు అంటే నీటిలో పడినా లేక మొబైల్ ఎప్పుడైనా చేయి నుండి జారి క్రింద పడిపోయినప్పటికీ మొబైల్‌కి ఎటువంటి ప్రమాదం సంభవించదు. ఐపి67 సర్టిఫికెట్ పొందిన మొబైల్స్ వాటర్ రిసెస్టెన్స్ ఫీచర్‌ని కూడా కలిగి ఉంటాయి. శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ ఫీచర్స్‌ని ఒక్కసారి చూద్దాం...

శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ మొబైల్ ఫీచర్స్:

సాప్ట్ వేర్
ఆపరేటింగ్ సిస్టమ్: Google Android 2.3 Gingerbread OS
సిపియు: 800 MHz Marvell MG2 processor
మెసేజింగ్: MMS, SMS, IM, Email, RSS
ఎఫ్ ఎమ్ రేడియో: Yes
గేమ్స్: Yes
కలర్స్: Black
జిపిఎస్: Yes
యూజర్ ఇంటర్ ఫేస్: Samsung TouchWiz UI, Multi Touch Proximity Sensor, Accelerometer sensor, SWYPE Integration

సైజు
చుట్టుకొలతలు: 122 x 66 x 12mm (dimensions)
బరువు: 116g
ఫామ్ ఫ్యాక్టర్: Candybar

డిస్ ప్లే
టైపు: Capacitive Touchscreen, 16 777 216 Colors
సైజు: 320 x 480 pixels, 3.65 inches

సౌండ్
అలర్ట్ టైప్స్: Vibration, Polyphonic(64), MP3 ringtones
లౌడ్ స్పీకర్: Yes
3.5mm జాక్: Yes

మొమొరీ
ఫోన్ బుక్: Yes
కాల్ రికార్డ్స్: Yes
ఇంటర్నల్ మొమొరీ: 150MB internal storage, 512MB RAM,
మైక్రో ఎస్‌డి కార్డ్ స్లాట్: microSD Card Slot To Expand 32GB Memory

డేటా
జిపిఆర్‌ఎస్: Yes
ఎడ్జి: Yes
3జీ: Yes (HSDPA 7.2 Mbit/s)
వైర్ లెస్ ల్యాన్: Wi-Fi 802.11 b/g, Wi-Fi hotspot
బ్లూటూత్: Yes, v2.1 with A2DP
యుఎస్‌బి: Yes, microUSB v2.0

కెమెరా ఫీచర్స్
ప్రైమరీ కెమెరా: 3.2 megapixel rear camera (2048

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot