శాంసంగ్ XCover7 Pro 5G వచ్చేస్తోంది..6.6 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా, మార్చుకోగల బ్యాటరీతో రగ్గడ్ ఫోన్!
Samsung Galaxy XCover7 Pro : ఫోన్ల తయారీలో పెద్ద పేరున్న శాంసంగ్ (Samsung), తన సరికొత్త 'రగ్గడ్' స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 7 ప్రో (Galaxy XCover7 Pro)ను అధికారికంగా ప్రకటించింది. 'రగ్గడ్' అంటే గట్టిదన్నమాట. ముఖ్యంగా కష్టపడి పనిచేసే వారికి, బయట ఫీల్డ్‌లో తిరిగే టీమ్‌ల కోసం, అలాగే గట్టి వాతావరణంలో పనిచేసే వారికోసం దీన్ని ప్రత్యేకంగా తయారుచేశారు.
అదిరిపోయే డిజైన్, వేగవంతమైన పనితీరు, ఎన్నో ఉపయోగపడే ఫీచర్లతో ఈ ఫోన్ ఆకట్టుకుంటోంది. ఇంతకుముందు మోడల్స్ అయిన గెలాక్సీ ఎక్స్‌కవర్ 6 ప్రో, గెలాక్సీ ఎక్స్‌కవర్ 7తో పోలిస్తే, ఇందులో ఇంకా మంచి ప్రాసెసర్, చాలా స్మూత్‌గా ఉండే డిస్‌ప్లే, సరికొత్త సాఫ్ట్‌వేర్ ఉన్నాయి. ఇది నిజంగా ఒక పెద్ద మెరుగుదల అనే చెప్పాలి.

* ఎలాంటి కఠిన పరిస్థితులైనా తట్టుకుంటుంది..
గెలాక్సీ ఎక్స్‌కవర్ 7 ప్రో ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేలా డిజైన్ చేశారు. దీనికి IP68 రేటింగ్ ఉంది. అంటే, దుమ్ము, ధూళి లోపలికి వెళ్లవు, నీళ్లలో పడినా కూడా పాడవకుండా పూర్తి రక్షణ ఉంటుంది. ఇది MIL-STD-810H అనే మిలిటరీ ప్రమాణాలను అందుకుంది.
అంటే, కింద పడినా, గట్టి దెబ్బ తగిలినా, ఎక్కువ వేడి లేదా చలిలో కూడా ఇది సేఫ్‌గా పనిచేస్తుంది. ఫోన్ చుట్టూ మందంగా రబ్బరు లాంటి అంచులు ఉన్నాయి. 6.6-అంగుళాల స్క్రీన్‌కు గీతలు, పగుళ్లు పడకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ (Corning Gorilla Glass Victus+) ప్రొటెక్షన్ ఇచ్చారు.
* గ్లౌజులు వేసుకున్నా పనిచేసే స్క్రీన్..
ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల ఫుల్ HD+ LCD స్క్రీన్ ఉంది. దీని 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల ఫోన్ వాడేటప్పుడు, వీడియోలు చూసేటప్పుడు అన్నీ చాలా స్మూత్‌గా, జాయిగా అనిపిస్తాయి. ఇందులో 'టచ్ సెన్సిటివిటీ మోడ్', 'వెట్ టచ్' అనే ప్రత్యేక టచ్ ఫీచర్లు ఉన్నాయి.
వీటివల్ల గ్లౌజులు వేసుకున్నా సరే, లేదా స్క్రీన్ తడిగా ఉన్నప్పుడు కూడా ఫోన్‌ను సులభంగా వాడొచ్చు. బిల్డింగ్ పనులు చేసేవాళ్లకు, డెలివరీ బాయ్స్‌కు ఇది ఉపయోగపడుతుంది. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా స్క్రీన్ బాగా కనిపించడానికి శాంసంగ్ 'విజన్ బూస్టర్' అనే టెక్నాలజీని కూడా ఇందులో పెట్టింది.
* స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 చిప్‌సెట్
ఫోన్ పనితీరు విషయంలోనూ ఇది తగ్గట్లేదు. ఇందులో కొత్త 4nm టెక్నాలజీతో తయారైన స్నాప్‌డ్రాగన్ 7s Gen 3 (Snapdragon 7s Gen 3) ప్రాసెసర్ వాడారు. దీనివల్ల ఫోన్ చాలా వేగంగా పనిచేస్తుంది. ఒకేసారి ఎక్కువ యాప్స్ వాడినా, గేమ్స్ ఆడినా ఎక్కడా స్లో అవ్వదు. గ్రాఫిక్స్ కోసం Adreno 710 GPU ఉంది.
* స్టోరేజ్, ర్యామ్
6GB RAM, 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇంకా ఎక్కువ స్టోరేజ్ కావాలంటే, మైక్రో SD కార్డ్ వేసుకుని ఏకంగా 2TB (టెరాబైట్) వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్ సరికొత్త ఆండ్రాయిడ్ 15 (Android 15), వన్ UI 7 (One UI 7) ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.
అంతేకాదు, ఇందులో 'సర్కిల్ టు సెర్చ్', 'ఆబ్జెక్ట్ ఎరేజర్' (ఫొటోల్లో వద్దనుకున్న వాటిని తీసేయడం), 'రీడ్ అలౌడ్' (స్క్రీన్‌పై ఉన్నది చదివి వినిపించడం), 'AI సెలెక్ట్' (టెక్స్ట్‌ను సులువుగా సెలెక్ట్ చేయడం) లాంటి చాలా ఉపయోగకరమైన AI ఫీచర్లు కూడా ఉన్నాయి.
* ఫొటోలు, సౌండ్ క్వాలిటీ
వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందువైపు 13MP కెమెరా ఇచ్చారు. పాటలు వినడానికి, సినిమాలు చూడటానికి ఇంకా మంచి అనుభూతిని ఇవ్వడానికి డాల్బీ అట్మాస్ (Dolby Atmos) టెక్నాలజీతో స్టీరియో స్పీకర్లు పెట్టారు. దీనివల్ల ఫోన్ కాల్స్, పాటలు మరింత స్పష్టంగా, పెద్దగా వినిపిస్తాయి.
* కనెక్టివిటీ, స్పెషల్ బటన్లు
అన్ని రకాల కనెక్టివిటీ సదుపాయాలు ఇందులో ఉన్నాయి. వేగవంతమైన 5G ఇంటర్నెట్, డ్యూయల్ సిమ్ (ఒక ఫిజికల్ నానో సిమ్ + ఒక eSIM), Wi-Fi 6E, బ్లూటూత్ 5.4, దారి తెలుసుకోవడానికి GPS, పేమెంట్స్ కోసం NFC లాంటి అన్ని లేటెస్ట్ ఆప్షన్లు ఉన్నాయి.
ఫోన్‌ను లాక్ చేయడానికి ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఉన్నాయి. దీనివల్ల మొబైల్ వెంటనే వాడాల్సివచ్చినప్పుడు ఈజీగా అన్‌లాక్ చేసుకోవచ్చు. మీ డేటాను మరింత సురక్షితంగా ఉంచడానికి శాంసంగ్ నాక్స్ వాల్ట్ (Samsung Knox Vault) అనే అదనపు భద్రతా వ్యవస్థ కూడా ఉంది.
* నచ్చినట్టు మార్చుకునే బటన్లు
ఈ ఫోన్‌లో రెండు ప్రత్యేక బటన్లు ఉన్నాయి. ఒకటి పైన (టాప్ కీ), ఇంకోటి పక్కన (ఎక్స్‌కవర్ కీ). ఈ బటన్లకు మీకు నచ్చిన యాప్స్‌ను సెట్ చేసుకోవచ్చు (ఉదా: కెమెరా, టార్చ్‌లైట్) లేదా బార్‌కోడ్ స్కానర్ లాంటి వాటిని వెంటనే ఓపెన్ చేయడానికి వాడుకోవచ్చు. ఇది పని ప్రదేశాల్లో చాలా సౌకర్యంగా ఉంటుంది.
* బ్యాటరీని మీరే మార్చుకోవచ్చు..
ఈ ఫోన్‌లో 4,350mAh బ్యాటరీ ఉంది. దీని స్పెషాలిటీ ఏంటంటే, అవసరమైతే యూజర్లే సులభంగా పాత బ్యాటరీ తీసి కొత్తది వేసుకోవచ్చు. ఛార్జింగ్ కోసం USB-C 3.2 పోర్ట్ ఉంది. అంతేకాకుండా, ఆఫీసుల్లో వాడే పెద్ద ఛార్జింగ్ డాక్స్ కోసం పోగో పిన్ (POGO pin) కనెక్టర్లు కూడా ఉన్నాయి.
* ధర ఎంత? ఎప్పుడు కొనొచ్చు..
మోడల్: శాంసంగ్ గెలాక్సీ ఎక్స్‌కవర్ 7 ప్రో ఒకే మోడల్‌లో దొరుకుతుంది. అది 6GB RAM + 128GB స్టోరేజ్. దీని ధర 609 యూరోలు మన భారతీయ కరెన్సీలో ఇది సుమారుగా రూ. 59,290 ఉండొచ్చు. 2025, ఏప్రిల్ 28 నుంచి కొన్ని యూరోపియన్ దేశాల్లో, 2025, మే 8 నుంచి అమెరికాలో అమ్మకాలు మొదలవుతాయి. మన దేశంలో ఎప్పుడు వస్తుందనే విషయం ఇంకా తెలియలేదు.


Click it and Unblock the Notifications








