రేపే రిలీజ్... ఆడ్వాన్స్ బుకింగ్ ఓపెన్!

Posted By: Prashanth

రేపే రిలీజ్... ఆడ్వాన్స్ బుకింగ్ ఓపెన్!

 

సౌత్ కొరియన్ మొబైల్ తయారీ దిగ్గజం సామ్‌సంగ్, గెలాక్సీ వై డ్యూయోస్ లైట్ పేరుతో మధ్య ముగింపు డ్యూయల్ సిమ్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను బుధవారం దేశీయ మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ధర అంచనా రూ.6,000 నుంచి రూ.7,000 మధ్య. ఔత్సాహికులు సామ్‌సంగ్ ఈ-స్టోర్‌లో ఆడ్వాన్స్ కింద రూ.వెయ్యి చెల్లించి హ్యాండ్‌సెట్‌ను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చు.

ఫోన్ కీలక ఫీచర్లు:

ఫోన్ చుట్టుకొలత 103.5 x 58 x 12మిల్లీమీటర్లు,

2.8 అంగుళాల టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్),

ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం,

832మెగాహెర్జ్ ప్రాసెసర్,

2జీబి ఆన్‌బోర్డ్ మెమెరీ,

మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకునే సౌలభ్యత,

2 మెగాపిక్సల్ రేర్ కెమెరా,

వై-ఫై b/g/n, వై-ఫై హాట్ స్పాట్,

3జీ,

బ్లూటూత్,

యూఎస్బీ కనెక్టువిటీ,

1200ఎమ్ఏహెచ్ లియోన్ బ్యాటరీ.

Read In English

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot