'దడ' పుట్టించడానికి 'రెడీ' అయిన శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్స్

Posted By: Super

'దడ' పుట్టించడానికి 'రెడీ' అయిన శ్యామ్‌సంగ్ గెలాక్సీ ఫోన్స్

ప్రపంచ జనాభా రోజురోజుకీ పెరుగుతున్న సందర్బంలో మొబైల్ యూజర్స్ కూడా అలానే పెరిగిపోతున్నారు. దాంతో మొబైల్ తయారీదారులు రోజుకో కొత్త మొబైల్ ఫోన్లని మార్కెట్లోకి విడుదల చేస్తున్నారు. శ్యామ్‌సంగ్ మొబైల్స్ గతంలో విడుదల చేసిన గెలాక్సీ సిరిస్‌కు మంచి స్పందన రావడంతో శ్యామ్‌సంగ్ కంపెనీ గెలాక్సీ సిరస్‌లో మరో రెండు కొత్త మోడల్స్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తుంది. ఆ రెండు మోడల్స్ శ్యామ్‌సంగ్ గెలాక్సీ వై, శ్యామ్‌సంగ్ గెలాక్సీ డబ్ల్యు. ఈ రెండు మోడల్స్‌ని కూడా శ్యామ్‌సంగ్ స్మార్ట్ ఫోన్స్ కేటగిరి క్రింద విడుదల చేయడం విశేషం. వీటితో పాటు ఇంకా శ్యామ్‌సంగ్ ఫ్యామిలీ నుండి స్మార్ట్ పోన్ కేటగిరిలో శ్యామ్‌సంగ్ వై ప్రో, ఎమ్ ప్రో విడుదల చేయనున్న విషయం తెలిసిందే.

GHz మొబైల్ ఫోన్ 1.4 GHz సింగల్ కోర్ ప్రాసెసర్‌ని కలిగి ఉంది. యూజర్స్‌కు చక్కని విజువల్ ఎక్స్ పీరియన్స్‌ని అందించేందుకు గాను దీనియొక్క స్క్రీన్ సైజు 3.7 ఇంచ్ డిస్ ప్లేగా రూపోందించడం జరిగింది. ఇందులో ఉన్న టచ్ స్కీన్ మల్టీటచ్‌తో పాటు, లైట్ సెన్సార్‌ని కలిగి ఉంది. అదే శ్యామ్‌సంగ్ గెలాక్సీ వై విషయానికి వస్తే మాత్రం 3.0 ఇంచ్ టచ్ డిస్ ప్లే దీని సొంతం. టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ యొక్క్ 256కె కలర్స్‌తో రూపోందించబడింది. శ్యామ్‌సంగ్ గెలాక్సీ వై, డబ్ల్యుల ఫీచర్స్ గనుక గమనించినట్లైతే...

శ్యామ్‌సంగ్ గెలాక్సీ వై, డబ్ల్యు రెండు మొబైల్స్ కూడా ఆండ్రాయిడ్ జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తోనే రన్ అవ్వడం జరుగుతుంది. గెలాక్సీ వై తో పోల్చితే గెలాక్సీ డబ్ల్యులో కొన్ని ఫీచర్స్ అధనంగా ఉన్నాయి. రెండు మొబైల్స్ లోను ఉన్న మేజర్ తేడా ఏంటంటే శ్యామ్‌సంగ్ డబ్ల్యు 5 మెగా ఫిక్సల్ కెమెరా, ఎల్‌ఈడితో ఉండగా, శ్యామ్‌సంగ్ వై మాత్రం 2 మెగా ఫిక్సల్ కెమెరాని కలిగి ఉంది. రెండు మొబైల్స్ కూడా కనెక్టివిటీ విషయంలో కొంచెం సెక్యూర్‌గా ఉన్నాయనడంలో ఎటువంటి సందేహాం లేదు. రెండు మొబైల్స్ కూడా బ్లూటూత్ 3.0 వర్సన్‌ని సపోర్ట్ చేయగా, వై-పై విషయానికి వస్తే WiFi802.11 b/g/nని సపోర్ట్ చేస్తాయి.

ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని రకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తాయి. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కు కనెక్ట్ చేసుకునేందుకు మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. ఈ ఫీచర్స్‌తో పాటు గూగుల్ సెర్చ్, గూగుల్ టాక్, డాక్యుమెంట్ వివర్ లాంటి ఆన్ లైన్ అఫ్లికేషన్స్‌ని కూడా సపోర్ట్ చేస్తాయి. వీటితోపాటు సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ ఫేస్‌బుక్, గూగుల్ ప్లస్ లాంటి వాటిని ఈజీగా కనెక్ట్ అయ్యేందుకు బటన్స్ కూడా మొబైల్స్‌లలో రూపోందించబడ్డాయి. ఇక బ్యాటరీ బ్యాక్ అప్ విషయానికి వస్తే శ్యామ్‌సంగ్ గెలాక్సీ వై ఫోన్ కూడా Li-Ion 1200mAh, శ్యామ్‌సంగ్ గెలాక్సీ డబ్ల్యు మాత్రం Li-Ion 1500mAh స్టాండర్డ్ బ్యాటరీలను కలిగి ఉన్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot