శ్యామ్‌సంగ్ మళ్లి ఎక్స్‌పోజ్ అయ్యింది...?

Posted By: Prashanth

శ్యామ్‌సంగ్ మళ్లి ఎక్స్‌పోజ్ అయ్యింది...?

 

మొబైల్ ఉత్సాదక రంగంలో విజయ బాహుటా ఎగరవెస్తున్న శ్యామ్‌సంగ్ దినా దినాభివృద్ధి చెందుతోంది. అంతర్జాతీయంగా సాంకేతిక ప్రేమికుల విశేష ఆదరణను చొరగుంటున్న ఈ ఫర్‌ఫెక్ట్ బ్రాండ్ ‘గెలక్సీ సిరీస్’ స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెట్టి తన పరిపతిని మరింత పెంచుకుంది. ఈ సిరీస్‌లో శ్యామ్‌సంగ్ తాజాగా విడుదల చేయుబోతున్న మరో వేరియంట్ ‘శ్యామ్‌సంగ్ గెలక్సీ Y ప్రో డ్యూయోస్’(Samsung Galaxy Y Pro Duos). ఈ మొబైల్ మునుపటి వర్షన్ ‘శ్యామ్ సంగ్ గెలక్సీ వై ప్రో’కు దగ్గర పోలికలు కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ ముఖ్య ఫీచర్లను పరిశీలిస్లే.. డ్యూయల్ సిమ్ సౌలభ్యత ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. జీఎస్ఎమ్ మొబైల్ నెట్‌వర్క్‌ను ఈ డివైజ్ సపోర్ట్ చేస్తుంది. నిక్షిప్తం చేసిన 3జీ సౌలభ్యత వేగవంతమైన నెట్ బ్రౌజింగ్‌కు దోహదపడుతుంది. రూపొందించిన క్వర్టీ (QWERTY) స్టైల్ కీ‌బోర్డ్ సౌకర్యవంతమైన టైపింగ్‌కు అనువుగా ఉంటుంది. కనెక్టువిటీ అంశాలను పటిష్టతం చేస్తూ జీపీఆర్ఎస్, ఎడ్జ్ వ్యవస్థలను డివైజులో పొందుపరిచారు. లోడ్ చేసిన 802.11 b/g/n వై -ఫై, వై-ఫై హాట్ స్పాట్ సపోర్ట్, v3.0 బ్లూటూత్, మైక్రో యూఎస్బీ, మైక్రో ఎస్డీ మెమరీ కార్డ్ స్లాట్ వ్యవస్థలు డేటాను వేగవంతంగా షేర్ చేస్తాయి.

ఆండ్రాయిడ్ జింజర్ బోర్డ్ ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ ఫోన్ విధులు నిర్వహిస్తుంది. కెమెరా సామర్ధ్యం 3.2 మెగా పిక్సల్, అమర్చిన స్టాండర్డ్ లయన్ బ్యాటరీ వ్యవస్థ పటిష్ట బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మార్కెట్లో ఫోన్ విడుదల ఇతర ధర అంశాలకు సంబంధించిన వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting