Home
Mobile

శాంసంగ్‌ గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ విడుదల... 6.7 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరా సహా AI ఫీచర్‌లు..!!

శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్‌ ఈవెంట్‌ లో శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ ఫోన్ సహా గెలాక్సీ Z ఫ్లిప్ 6 హ్యాండ్‌ సెట్‌ (Samsung Galaxy Z Flip 6 Smartphone launched) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ AI ఫీచర్‌ లను కలిగి ఉంటాయి. గెలాక్సీ ఏఐ ఫీచర్లు సహా గూగుల్‌ సర్కిల్ టూ సెర్చ్‌ ఫీచర్‌, జెమిని AI చాట్‌బాట్‌ ను సపోర్టు చేస్తుంది. ఈ హ్యాండ్‌ సెట్‌ ను ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్‌ చేసుకోవచ్చు. అయితే సేల్‌ జులై 24 నుంచి ప్రారంభం కానుంది.

శాంసంగ్‌ గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
శాంసంగ్‌ గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత శాంసంగ్ One UI 6.1.1 Skin ను కలిగి ఉంది. మరియు కస్టమ్ క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 8 జెన్‌ 3 గెలాక్సీ మొబైల్‌ ప్లాట్‌ఫాం పైన పనిచేస్తుంది. గరిష్ఠంగా 12GB ర్యామ్‌, 512GB స్టోరేజీతో జతచేయబడుతుంది.

Samsung Galaxy Z Flip 6 Smartphone sale

గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 స్మార్ట్‌ ఫోన్‌ 720*748 పిక్సల్‌ రిజల్యూషన్‌, 60Hz రీఫ్రెష్‌ రేట్‌, 360ppi డెన్సిటీతో 3.4 ‌అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ జౌటర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 1080*2640 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.7 అంగుళాల పుల్‌ HD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2x ఇన్ఫినిటీ ఫ్లెక్స్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌ 1Hz నుంచి 120Hz వరకు ఉంటుంది.

50MP +12MP కెమెరాలు :
గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 స్మార్ట్‌ ఫోన్‌ OIS, డ్యూయల్‌ పిక్సల్‌ ఆటోఫోకస్‌, f/1.8 అపేచర్‌తో 50MP వైడ్‌ యాంగిల్‌ కెమెరా, f/2.2 అపేచర్‌, 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరాను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌ తో 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

బ్యాటరీ, ఛార్జింగ్‌ వివరాలు :
స్మార్ట్‌ఫోన్‌ 25W శాంసంగ్‌ వైర్‌ ఛార్జర్‌ సపోర్టుతో 4000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ ఫాస్ట్‌ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 మరియు వైర్‌లెస్‌ పవర్‌షేర్‌ సపోర్టును కలిగి ఉంటుంది. అయితే ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని శాంసంగ్‌ తెలిపింది. IP48 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్ రెసిస్టెంట్, భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.

ధర సేల్ వివరాలు :
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర $1099 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌ భారత్‌ మార్కెట్‌లో ఎంత ధరకు అందుబాటులోకి రానుందో సంస్థ వెల్లడించలేదు. అయితే సేల్‌ జులై 24 నుంచి ప్రారంభం కానుంది. బ్లూ, మింట్‌, సిల్వర్‌ మరియు పసుపు రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్‌ ద్వారా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకంగా పీచ్‌ రంగు వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Z Flip 6 Smartphone launched in india specs features sale details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X