శాంసంగ్ గెలాక్సీ Z Flip 7 FE స్మార్ట్‌ఫోన్ ధర సహా కీలక వివరాలు లీక్.. ఎప్పుడు విడుదల కానుంది..?
శాంసంగ్ నుంచి త్వరలో గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ Z ఫోల్డ్ 7 ఫోల్డబుల్ ఫోన్లు లాంచ్ అయ్యే అవకాశం ఉందని లీక్స్ వచ్చాయి. ఈ మోడల్స్‌కు సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. అయితే తాజాగా శాంసంగ్ నుంచి మరో ఫోన్ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. గెలాక్సీ Z Flip 7 FE పేరుతో విడుదల కానుందని తెలుస్తోంది. దీనిపై సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఎంత ధరకు అందుబాటులోకి రానుంది? :
అయితే శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy Z Flip 7 FE Smartphone) ధర $736 గా ఉంటుందని తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం చూస్తే రూ.61,000 గా ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే టాక్స్‌లు సహా ఇతర సుంకాలతో కలిపితే రూ.65000 వేలకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఉన్న మోడల్స్‌తో పోలిస్తే భారీ తక్కువ ధరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. జులై 2025 లో సాధారణంగా శాంసంగ్ నుంచి గెలాక్సీ Z Flip 7 మోడల్స్ విడుదలవుతుంటాయి. ఈ మోడల్స్ అందుబాటులోకి వచ్చిన కొన్ని నెలల తర్వాతే గెలాక్సీ Z Flip 7 FE స్మార్ట్‌ఫోన్ విడుదలయ్యే అవకాశం ఉంది.
సొంత చిప్‌సెట్‌తోనే! :
స్పెసిఫికేషన్‌ల విషయానికి వస్తే గెలాక్సీ Z Flip 7 FE స్మార్ట్‌ఫోన్ Exynos 2500 చిప్‌సెట్‌తో పనిచేసే అవకాశం ఉంది. ఇందుకు అధిక సమయం తీసుకొనే అవకాశం ఉంది. అందువల్ల ఈ ఫోన్ ఈ సంవత్సరం చివర్లో లాంచ్ కానుందని అంచనా వేస్తున్నారు.
శాంసంగ్ గెలాక్సీ Z Flip 7 FE యూరోపియన్ వేరియంట్ వివరాలను డచ్ అవుట్‌లెట్ గెలాక్సీ క్లబ్ ఆధారంగా లీక్ అయ్యాయి. దీని ఆధారంగా ఈ ఫోన్ SM-F761B మోడల్ నంబర్‌ను కలిగి ఉంది. మరియు శాంసంగ్ Exynos 2400e చిప్‌సెట్‌తో పనిచేస్తుందని తెలుస్తోంది.
అయితే మార్కెట్‌లకు అనుగుణంగా చిప్‌సెట్ లో మార్పులు ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతోపాటు ఈ చిప్‌సెట్ 8GB తో అందుబాటులోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. మరియు ఈ ఫోన్ 3700mAh బ్యాటరీతో పనిచేస్తుందని తెలుస్తోంది.
కెమెరా విభాగం పరంగా ఈ ఫ్యాన్ ఎడిషన్ స్మార్ట్‌ఫోన్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఇందులో 12MP ప్రైమరీ కెమెరాతోపాటు 12MP అల్ట్రావైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరియు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 10MP సెల్ఫీ కెమెరాతో అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.
శాంసంగ్ Z ఫ్లిప్ 7 FE స్మార్ట్‌ఫోన్ విడుదలపై సంస్థ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. గెలాక్సీ Z Flip 7 మరియు గెలాక్సీ Z ఫోల్డ్ 7 విడుదల అనంతరం ఫ్యాన్ ఎడిషన్ మోడల్‌పై మరిన్ని వివరాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం వస్తున్న లీక్స్ ఆధారంగా ఫ్యాన్ ఎడిషన్ మోడల్ అందుబాటు ధరకు లాంచ్ కానుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications