శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 స్మార్ట్‌ఫోన్ విడుదల.. ఇవాళ్టి నుంచే ప్రీ ఆర్డర్.. పూర్తి వివరాలు..!
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 లో (Samsung Unpacked 2025) భాగంగా శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7, శాంసంగ్ గెలాక్సీ Z Flip 7 ఫోన్‌లు (Samsung Galaxy Z Flip 7 Smartphone) లాంచ్ అయ్యాయి. ఈ ఫోన్ స్లిమ్ డిజైన్‌లో విడుదల అయింది. ఈ ఫోన్‌ను ఫోల్డింగ్ చేసిన సమయంలో థిక్‌నెస్ 13.7mm గా ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ 188 గ్రాముల బరువును కలిగి ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 7 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గెలాక్సీ ఫ్లిప్ ఫోన్ 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ తో 6.9 అంగుళాల FHD+ (2520 x 1080 పిక్సల్స్) డైనమిక్ అమోలెడ్ 2x డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 4.1 అంగుళాల సూపర్ అమోలెడ్ కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఎక్కువ రోజులపాటు మన్నిక వచ్చేందుకు ఆర్మర్ FlexHinge ను కలిగి ఉంది. ఈ ఫ్లిప్ ఫోన్ IP48 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ జెమిని లైవ్, Now Bar, Now Brief వంటి అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను కలిగి ఉంటుంది.
చిప్‌సెట్ వివరాలు :
గెలాక్సీ Z ఫ్లిప్ 7 స్మార్ట్‌ఫోన్ Exynos 2500 చిప్‌సెట్ తో పనిచేస్తుంది. ఈ చిప్‌సెట్ 12GB ర్యామ్, 512GB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ వేరియంట్‌లో లాంచ్ అయింది.

కెమెరా వివరాలు :
కెమెరా విభాగం పరంగా ఈ ఫ్లిప్ ఫోన్ f/1.8 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 అపేచర్, 123 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాలను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం f/2.2 అపేచర్‌తో 10MP కెమెరాను అమర్చారు.
ఈ హ్యాండ్‌సెట్ 4300mAh బ్యాటరీ తో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి గరిష్ఠంగా 31 గంటల వీడియో ప్లే టైంను పొందవచ్చని శాంసంగ్ చెబుతోంది. 25W వైర్ ఫాస్ట్ ఛార్జింగ్, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 సపోర్టును కలిగి ఉంటుంది.

కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 6E ఫీచర్లున్నాయి. యాక్సెలిరోమీటర్, బారో మీటర్, గైరో సెన్సర్, జియోమాగ్నటిక్ సెన్సర్, హాల్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ సెన్సర్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ Knox ఫీచర్‌ను కూడా కలిగి ఉంది.
ఈ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను శాంసంగ్ వెల్లడించలేదు. అయితే ఇవాళ్టి నుంచే (జులై 9) ముందస్తు బుకింగ్ (Pre Order) చేసుకొనేందుకు అవకాశం కల్పించింది. జులై 25 నుంచి భారత్ లో సేల్ ప్రారంభం కానుంది. ఈ ఫోన్ బ్లూ షాడో, జెట్ బ్లాక్, కోరల్ రెడ్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది. మింట్ కలర్ వేరియంట్ (ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజిన్) గా లభిస్తుంది.


Click it and Unblock the Notifications








