Home
Mobile

50MP కెమెరా, 120Hz డిస్‌ప్లే.. దిమ్మతిరిగే ఫీచర్లతో వస్తోన్న శామ్‌సంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ FE

Samsung Galaxy Z Flip FE: ప్రముఖ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శామ్‌సంగ్ తన మొట్టమొదటి ఫోల్డబుల్ ఫ్యాన్ ఎడిషన్ (FE) ఫోన్‌ను విడుదల చేయడానికి సిద్ధమవుతోందని సమాచారం. ఇంతకు ముందు శామ్‌సంగ్ కేవలం గెలాక్సీ S సిరీస్‌లో మాత్రమే FE మోడల్స్‌ను రిలీజ్ చేసింది. ఇప్పుడు ఫోల్డబుల్ ఫోన్లలో కూడా FE మోడల్‌ను పరిచయం చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. దాంతో మధ్యతరగతి ప్రజలు చాలా కృషి అవుతున్నారు.

గెలాక్సీ Z ఫ్లిప్ FEగా రాబోతున్న ఈ కొత్త మోడల్ గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ Z ఫోల్డ్ 7తో పాటే జులైలో లాంచ్ అవుతుందని అంచనా. ఈ ఫోన్ కెమెరా, డిస్‌ప్లే, ఛార్జింగ్ స్పీడ్ వంటి ముఖ్యమైన ఫీచర్లకు సంబంధించిన వివరాలు ఇప్పటికే లీక్ అయ్యాయి. ఆ వివరాలు ఏవో తెలుసుకుందాం పదండి.

Samsung Galaxy Z Flip FE Leak Hints at 50MP Camera  120Hz Display  and Fast Charging

* గెలాక్సీ Z ఫ్లిప్ FEలో కొత్తగా ఏముండబోతోంది..

ప్రముఖ టిప్‌స్టర్ గెలాక్సీ Z ఫ్లిప్ FE గురించిన కొన్ని కొత్త విషయాలు లీక్ చేశారు. లీక్‌లో ఫోన్ పేరు వెల్లడించలేదు కానీ, ఇది ఫ్లిప్ FE మోడల్‌ గురించేనని టెక్ నిపుణులు భావిస్తున్నారు. లీక్స్ ప్రకారం, ఈ ఫోన్‌లో గెలాక్సీ Z ఫ్లిప్ 6లో వాడిన అల్ట్రా-థిన్ గ్లాస్ (UTG), హింజ్ మెకానిజంనే ఉపయోగించబోతున్నారు.

ఇది చాలా ఆసక్తికరమైన మెకానిజం. ఇక స్మూత్ స్క్రోలింగ్, యానిమేషన్స్ కోసం 120Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లే ఇవ్వనున్నారు. స్క్రీన్ పీక్ బ్రైట్‌నెస్ 2600 నిట్స్ వరకు ఉండొచ్చట, కానీ టెస్టుల్లో రెగ్యులర్ బ్రైట్‌నెస్ మాత్రం 1900 నిట్స్ వరకు ఉంటుందట.

ఫోన్ బాడీ మరింత స్ట్రాంగ్‌గా ఉండటానికి ఆర్మోర్ అల్యూమినియం ఫ్రేమ్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్‌ వంటి క్వాలిటీ మెటీరియల్స్‌తో తయారు చేయనున్నారు. దీని ఫలితంగా ఈ స్మార్ట్‌ఫోన్ చాలా కాలం మన్నే అవకాశం ఉంది. ఈ విషయాలను పరిగణలోకి తీసుకుంటే ఇది ప్రతి ఒక్కరికి బెస్ట్ ఆప్షన్ అవుతుందని చెప్పొచ్చు.

* కెమెరా, పర్ఫార్మెన్స్

గెలాక్సీ Z ఫ్లిప్ FEలో 50MP మెయిన్ కెమెరా ఉండబోతోందని రూమర్స్ వినిపిస్తున్నాయి. దీనివల్ల ఫొటో క్వాలిటీ మరింత మెరుగుపడుతుంది. ఇందులో శామ్‌సంగ్ ఎక్సీనోస్ ప్రాసెసర్‌ను ఉపయోగించవచ్చు. కానీ ఏ మోడల్ ప్రాసెసర్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. మునుపటి లీక్స్ ప్రకారం ఎక్సీనోస్ 2400 చిప్‌సెట్‌తో పాటు 12GB RAM, 256GB స్టోరేజ్‌తో రావచ్చు.

* బ్యాటరీ, ఛార్జింగ్

ఈ ఫోన్ 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది. ఫ్లాట్-ఫ్రేమ్ డిజైన్, ఫాస్ట్ ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం Wi-Fi 6E సపోర్ట్ వంటి ఎక్స్‌ట్రా ఫీచర్లు కూడా ఉండొచ్చు. గెలాక్సీ Z ఫ్లిప్ FEని జులైలో లాంచ్ చేసే అవకాశం ఉంది. అయితే, దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాల్సిందే.

పవర్‌ఫుల్ కెమెరా, స్మూత్ డిస్‌ప్లే, ప్రీమియం బిల్డ్‌తో రాబోతున్న గెలాక్సీ Z ఫ్లిప్ FE, శామ్‌సంగ్ ఫోల్డబుల్ లైనప్‌లో ఒక ఎక్స్‌యిటింగ్ ఎడిషన్ అని చెప్పొచ్చు. ఇది అందుబాటు ధరల్లోనే లాంచ్ కావచ్చు కాబట్టి మధ్యతరగతి వారు కూడా దీనిని కొనుగోలు చేసే అవకాశముంటుంది. దీని గురించిన మరిన్ని అప్‌డేట్స్ కోసం గిజ్‌బాట్ వెబ్‌సైట్ ఫాలో అవ్వండి.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Z Flip FE leaks reveal a 50MP camera, 120Hz display, and 25W fast charging. Launching in July with Z Flip 7 and Fold 7, it features Exynos processor, UTG, Armor Aluminum, and Gorilla Glass.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X