Samsung Galaxy Z Fold 4 V/S Galaxy Z Fold 3 ఫోన్ల మధ్య తేడాలు? కొత్త ఫీచర్లు ఏంటో చూడండి.

By Maheswara
|

శాంసంగ్ తాజాగా Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌తో పాటు Galaxy Z Flip 4, Galaxy Watch 5, Galaxy Buds 2 ప్రో డివైజ్‌లను ప్రవేశపెట్టారు. Galaxy Z Fold 4 వాటిలో ప్రముఖమైనది మరియు ఈ ఫోన్ Snapdragon 8 Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. మునుపటి Galaxy Z Fold 3 ఫోన్‌తో పోలిస్తే ఈ ఫోన్ ఎలాంటి కొత్త మార్పులు తీసుకువస్తోందో మీరు తెలుసుకోవాలి.

Samsung Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్

Samsung Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్

అవును, Samsung Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్ దాని ఆకర్షణీయమైన డిజైన్ మరియు అద్భుతమైన ఫీచర్లతో మార్కెట్లో సందడి చేసింది. ఈ ఫోన్‌లో 12GB RAM మరియు 256 GB స్టోరేజ్ వేరియంట్ ఎంపిక ఉంది. Galaxy Z Fold 3 ఫోన్ Snapdragon 888 చిప్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.

ట్రిపుల్ కెమెరా సెటప్‌

ట్రిపుల్ కెమెరా సెటప్‌

Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్ ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది, ప్రధాన కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉంటుంది. Galaxy Z Fold 4 ఫోన్ 3X టెలిఫోటో లెన్స్‌ని కలిగి ఉండేలా అప్‌గ్రేడ్ చేయబడింది, అయితే మునుపటి Galaxy Z Fold 3 ఫోన్‌లో 3X జూమ్ ఫీచర్ ఉంది. ఇప్పడు , Galaxy Z Fold 4 మరియు Galaxy Z Fold 3 ఫోన్‌ల మధ్య పూర్తి తేడాల గురించి తెలుసుకుందాం.

డిజైన్ మరియు డిస్ప్లే నాణ్యత

డిజైన్ మరియు డిస్ప్లే నాణ్యత

ఈ రెండు ఫోన్‌లు ఒకేలా కనిపిస్తున్నప్పటికీ, డిస్‌ప్లే ఆన్‌లో ఉన్నప్పుడు తేడాలు కనిపిస్తాయి. Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్ 7.6-అంగుళాల డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అంతేకాకుండా, కవర్ స్క్రీన్ 6.2-అంగుళాల HD+ డైనమిక్ AMOLED 2X కవర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే, గెలాక్సీ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ డిస్‌ప్లే డిజైన్‌ను కలిగి ఉంది. ఇది 7.6-అంగుళాల డైనమిక్ AMOLED 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను పొందుతుంది. అయితే ఈ ఫోన్ కవర్ స్క్రీన్ 6.2-అంగుళాల HD+ (832x2,268 పిక్సెల్‌లు) డైనమిక్ AMOLED 2X డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.

పనితీరు మరియు సాఫ్ట్‌వేర్ వివరాలు

పనితీరు మరియు సాఫ్ట్‌వేర్ వివరాలు

Galaxy Z Fold 4 మరియు Galaxy Fold 3 స్మార్ట్‌ఫోన్‌లకు ప్రాసెసర్‌లో తేడాలు ఉన్నాయి. కొత్త Galaxy Z Fold 4 Qualcomm Snapdragon 8+ Gen 1 SoC ప్రాసెసర్‌తో వస్తుంది. ఇది 12GB RAM మరియు 1TB ఇంటర్నల్ స్టోరేజీ తో Android 12 ఆధారిత One UI 4.1.1పై రన్ అవుతుంది. గెలాక్సీ ఫోల్డ్ 3 స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్‌తో వస్తుంది. మరియు వన్ యుఐతో ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో రన్ అవుతుంది. ఇప్పుడు ఈ ఫోన్‌లో 12GB + 256GB మరియు 12GB + 512GB స్టోరేజ్ వేరియంట్ లు ఉన్నాయి.

కెమెరా సెన్సార్ తేడాలు

కెమెరా సెన్సార్ తేడాలు

Samsung Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ప్రధాన కెమెరాలో 50 మెగా పిక్సెల్ సెన్సార్ ఉంది. రెండవ కెమెరా 12-మెగాపిక్సెల్ సెన్సార్ మరియు మూడవ కెమెరా 10-మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఇది ప్రధాన డిస్‌ప్లేపై 4 మెగా పిక్సెల్ సెన్సార్ కెమెరా మరియు కవర్ డిస్‌ప్లేపై 10 మెగా పిక్సెల్ సెన్సార్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. Samsung Galaxy Fold 3 స్మార్ట్‌ఫోన్ వెనుక మొత్తం మూడు కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. మూడు కెమెరాలు వరుసగా 12-మెగాపిక్సెల్ సెన్సార్ కలిగి ఉంటాయి. మరియు సెల్ఫీ కెమెరా (కవర్ కెమెరా) 10 MP సెన్సార్‌లో ఉంది.

బ్యాటరీ బ్యాకప్ వివరాలు

బ్యాటరీ బ్యాకప్ వివరాలు

బ్యాటరీ విభాగంలో, రెండూ దాదాపు ఒకేలా ఉంటాయి. Galaxy Z Fold 4 స్మార్ట్‌ఫోన్ 4,400mAh డ్యూయల్ బ్యాటరీతో పనిచేస్తుంది. దీనికి 25W ఛార్జర్ మద్దతు ఉంది. అదేవిధంగా, Samsung Galaxy Fold 3 స్మార్ట్‌ఫోన్ కూడా 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,400mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

 

Best Mobiles in India

Read more about:
English summary
Samsung Galaxy Z Fold 4 V/S Galaxy Z Fold 3 Comparison. What Are The New Features In A New Fold Phone ?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X