శాంసంగ్ నుంచి కీలక ప్రకటన.. ఈ ఫోన్ల ముందస్తు బుకింగ్‌పై గరిష్ఠంగా రూ.7000 ప్రయోజనాలు..!
శాంసంగ్ నుంచి ఇటీవల కీలక ప్రకటన వచ్చింది. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ ను ( Samsung Galaxy Unpacked Event 2024 ) జులై 10 న నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఈవెంట్ లో ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న స్మార్ట్ ఫోన్ లు సహా ఇతర గ్యాడ్జెట్ లు విడుదల కానున్నాయని తెలుస్తోంది. ఈ ఉత్పత్తులను ముందస్తుగా రిజర్వ్ చేసుకొనే అవకాశం కల్పించింది. వీటికి ప్రత్యేక ప్రయోజనాలు కల్పిస్తున్నట్లు తెలిపింది. పూర్తి వివరాలు మీకోసం.
రూ.7000 ప్రయోజనాలను పొందవచ్చు :
శాంసంగ్ గెలాక్సీ Z సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తుగా రిజర్వ్ చేసుకొనేందుకు రూ.2000 చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. శాంసంగ్ వెబ్‌సైట్ (Samsung.com), శాంసంగ్ స్టోర్‌లు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సహా ఇతర ప్రముఖ స్టోర్‌ల ద్వారా చెల్లించవచ్చని తెలిపింది. ముందస్తు రిజర్వ్ చేసుకొనే కస్టమర్‌లు రూ.7000 ప్రయోజనాలను పొందవచ్చని పేర్కొంది.

రూ.6,499 ప్రయోజనాలను పొందవచ్చు :
దీంతోపాటు గెలాక్సీ ఉత్పత్తులను కూడా ముందస్తుగా రిజర్వ్ చేసుకొనే అవకాశం కల్పించింది. ఇందుకోసం రూ.1,999 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఉత్పత్తులను రిజర్వ్ చేసుకున్న కస్టమర్లు రూ.6,499 ప్రయోజనాలను పొందనున్నారు. శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌ను జులై 10వ తేదీన ప్యారిస్‌లో నిర్వహించనుంది. భారత కాలమానం ప్రకారం అదేరోజు 10:30 PM ప్రారంభం కానుంది.
ఈ ఈవెంట్‌లో ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు విడుదల కానున్నాయని తెలుస్తోంది. గెలాక్సీ Z ఫోల్డ్ 6 (Galaxy Z Fold 6 Smartphone) మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 6 (Galaxy Z Flip 6 Smartphone) హ్యాండ్‌సెట్‌లు సహా వాచ్ సిరీస్‌లను కూడా ఆవిష్కరించనుందని తెలుస్తోంది. దీంతోపాటు గెలాక్సీ బడ్స్ 3 సిరీస్ మరియు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న గెలాక్సీ రింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది.
మూడు వేరియంట్‌లలో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6..! :
ఇప్పటివరకు లీకైన వివరాల ఆధారంగా.. శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ మూడు స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అమెరికాలో 256GB, 512GB, 1TB స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. మరియు నేవీ, సిల్వర్ షాడో, పింక్ రంగుల్లో లభించనుందని సమాచారం.
దీంతోపాటు శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధరలు కూడా లీక్ అయ్యాయి. 256GB వేరియంట్ ధర $1899.99 (భారత కరెన్సీ ప్రకారం రూ.1,58,562), అదే 512GB వేరియంట్ ధర $2019.99 (భారత కరెన్సీ ప్రకారం రూ.1,68,577), 1TB స్టోరేజీ ధర $2259.99 (భారత కరెన్సీ ప్రకారం రూ.1,88,606) గా ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








