ఇవాళ్టి నుంచి శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6, గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్లు సహా బడ్స్, వాచ్ సేల్..!
శాంసంగ్ జులై 10 వ తేదీన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 (Samsung Galaxy Z Fold 6), గెలాక్సీ Z ఫ్లిప్ 6 (Samsung Galaxy Z Flip 6) స్మార్ట్‌ఫోన్లు సహా గెలాక్సీ వాచ్ అల్ట్రా మరియు వాచ్ 7, గెలాక్సీ బడ్స్ 3 మరియు బడ్స్ 3 ప్రో ఇయర్‌బడ్స్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు సహా గ్యాడ్జెట్‌లను భారత్ మార్కెట్‌లో ఇవాళ్టి నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇవాళ సాయంత్రం 8 గంటల నుంచి సేల్ ప్రారంభం కానుంది. శాంసంగ్ ఇండియా వెబ్‌సైట్ నుంచి కొనుగోలు చేయవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ ధర :
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.1,64,999 గా ఉంది. 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.1,76,999 గా ఉంది.

మరియు 12GB ర్యామ్ + 1TB స్టోరేజీ ధర రూ.2,00,999 గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ నేవీ, పింక్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసేవారికి క్రాఫ్టెడ్ బ్లాక్, వైట్ రంగుల్లో కూడా లభిస్తుంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.1,09,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.1,21,999 గా ఉంది. బ్లూ, మింట్, సిల్వర్ మరియు పసుపు రంగుల్లో లభిస్తుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసేవారికి ప్రత్యేకంగా పీచ్ రంగు వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది.
HDFC బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.15,000 తగ్గింపును పొందవచ్చు. మరియు ఎక్స్చేంజీ బోనస్ ద్వారా మరో రూ.15,000 కూడా పొందవచ్చు. దీంతోపాటు నో కాస్ట్ EMI సదుపాయం అందుబాటులో ఉంది. దీంతోపాటు శాంసంగ్ షాప్ యాప్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ 6.3 అంగుళాల HD+ డైనమిక్ అమోలెడ్ 2x ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 410ppi పిక్సల్ డెన్సిటితో వచ్చింది. దీంతోపాటు 7.6 అంగుళాల QXGA+ డైనమిక్ అమోలెడ్ 2x ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఇన్నర్ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ రెండు డిస్‌ప్లేల అడాప్టి్వ్ రీఫ్రెష్ రేట్ 1Hz నుంచి 120Hz లుగా ఉంది.
ఈ ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత శాంసంగ్ One UI 6.1.1 Skin ను కలిగి ఉంటుంది. మరియు కస్టమ్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 గెలాక్సీ మొబైల్ ప్లాట్‌ఫాం పైన పనిచేస్తుందని తెలిపింది. కెమెరాల పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), f/1.8 అపేచర్ సహా డ్యూయల్ పిక్సల్ ఆటోఫోకస్ సపోర్టుతో 50MP వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది.
దీంతోపాటు f/2.2 అపేచర్, 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంది. కవర్ డిస్‌ప్లేపై f/2.2 అపేచర్‌తో 10MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇన్నర్ డిస్‌ప్లే పైన f/2.8 అపేచర్‌తో 4MP కెమెరాను కలిగి ఉంది. 25W శాంసంగ్ వైర్ ఛార్జర్ సపోర్టుతో 4400mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫ్లిప్ 6 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత శాంసంగ్ One UI 6. 1.1 Skin OS, కస్టమ్ క్వాల్‌కాం స్నాప్ డ్రాగన్ 8 జెన్ 3 గెలాక్సీ మొబైల్ ప్లాట్ ఫాం పైన పనిచేస్తుంది.
3.4 అంగుళాల సూపర్ అమోలెడ్ ఔటర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 6.7 అంగుళాల పుల్ HD+ డైనమిక్ అమోలెడ్ 2x ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్ 1Hz నుంచి 120Hz వరకు ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ OIS, డ్యూయల్ పిక్సల్ ఆటోఫోకస్, f/1.8 అపేచర్‌తో 50MP వైడ్ యాంగిల్ కెమెరా, f/2.2 అపేచర్, 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంది. f/2.2 అపేచర్‌తో 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 25W శాంసంగ్ వైర్ ఛార్జర్ సపోర్టుతో 4000mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది.
వీటితోపాటు గెలాక్సీ వాచ్ 7, వాచ్ అల్ట్రా మరియు గెలాక్సీ బడ్స్ 3 లను కూడా ఇవాళ సేల్‌లో భాగంగా కొనుగోలు చేయవచ్చు. 40mm గెలాక్సీ వాచ్ 7 స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.29,999, సెల్యూలర్ వేరియంట్ ధర రూ.33,999 గా ఉంది. 44mm స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.32,999, LTE వేరియంట్ ధర రూ.36,999 గా ఉంది.
వాచ్ అల్ట్రా ధర రూ.59,999 గా ఉంది. టైటానియం గ్రే, టైటానియం సిల్వర్, టైటానియం వైట్ రంగుల్లో లభిస్తుంది. అదే శాంసంగ్ బడ్స్ 3 ధర రూ.14,999 గా ఉండగా.. బడ్స్ 3 ప్రో రూ.19,999 గా ఉంది. సిల్వర్, వైట్ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా రూ.5,000 మరియు ఎక్స్చేంజీ ద్వారా రూ.5000 అదనపు తగ్గింపును పొందవచ్చు.


Click it and Unblock the Notifications








