Home
Mobile

రూ.35,000 భారీ డిస్కౌంట్‌తో గెలాక్సీ Z ఫోల్డ్ 6.. స్నాప్‌డ్రాగన్ 8 Gen 3, 12GB RAM, 7.6 అంగుళాల డిస్‌ప్లే.. అమ

Samsung Galaxy Z Fold 6 : మీరు ఒక స్టైలిష్ ఫోల్డబుల్ ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకొక శుభవార్త. శాంసంగ్ కంపెనీ తన ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ అయిన గెలాక్సీ Z ఫోల్డ్ 6 ధరను అమెజాన్ ఇండియాలో భారీగా తగ్గించింది. త్వరలో గెలాక్సీ Z ఫోల్డ్ 7 మార్కెట్లోకి రానుండటంతో, శాంసంగ్ ఇప్పుడు అందుబాటులో ఉన్న ఈ ఫోల్డ్ 6 మోడల్‌పై చాలా డిస్కౌంట్ ప్రకటించింది.

* గెలాక్సీ Z ఫోల్డ్ 6 కొత్త ధర ఎంతంటే..
భారత్‌లో మొదట రూ.1,64,999 ధరకు విడుదలైన శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6, ఇప్పుడు అమెజాన్‌లో కేవలం రూ.1,31,473 కే లభిస్తోంది. అంటే నేరుగా రూ.33,526 ధర తగ్గింది. ఇది మాత్రమే కాదు, అదనపు ఆఫర్లతో ఇంకా డబ్బు ఆదా చేసుకోవచ్చు. కొన్ని HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డులు వాడేవారికి మరో రూ.1,500 తగ్గింపు లభిస్తుంది.

Samsung Galaxy Z Fold 6

అదే HDFC కార్డుతో EMI ద్వారా కొంటే ఏకంగా రూ.3,250 డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా, ఈ ఫోన్‌ను సులభంగా కొనుగోలు చేసేందుకు అమెజాన్ నెలకు రూ.6,374 నుంచి వడ్డీ లేని వాయిదాల (No-cost EMI) సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేయావచ్చు.

ఓల్డ్ మొబైల్ మోడల్, కండిషన్‌ను బట్టి గరిష్టంగా రూ.22,800 వరకు అదనపు తగ్గింపు లభిస్తుంది. ఫోన్‌కు మరింత రక్షణ కావాలనుకుంటే, రూ.8,999 చెల్లించి టోటల్ ప్రొటెక్షన్ ప్లాన్ కూడా తీసుకోవచ్చు. ఈ ఫోన్ నేవీ, సిల్వర్ షాడో రంగులలో అందుబాటులో ఉంది. అవి చూసేందుకు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.

* ముఖ్యమైన ఫీచర్లు, స్పెసిఫికేషన్లు
గెలాక్సీ Z ఫోల్డ్ 6 డిజైన్ పరంగా, పనితీరు పరంగా టాప్ క్లాస్‌లో ఉంటుంది. ఇందులో రెండు స్క్రీన్లు ఉంటాయి. లోపలది పెద్ద 7.6-అంగుళాల QXGA+ అమోలెడ్ మెయిన్ డిస్‌ప్లే. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌, 2,600 నిట్స్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. సినిమాలు, గేమ్స్ చూడ్డానికి అద్భుతంగా ఉంటుంది.

బయట 6.3-అంగుళాల HD+ డైనమిక్ అమోలెడ్ 2X కవర్ డిస్‌ప్లే. ఫోన్ మూసి ఉన్నప్పుడు కూడా త్వరగా పనులు చేసుకోవడానికి, ఒక చేత్తో వాడటానికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుంది. ఈ ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ప్రాసెసిర్ వాడారు. ఇది ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.

అంతేకాదు, రే ట్రేసింగ్ టెక్నాలజీతో గేమ్స్ గ్రాఫిక్స్ మరింత అద్భుతంగా కనిపిస్తాయి. 12GB RAM ఉండటంతో ఫోన్ వేగంగా పనిచేస్తుంది. 1TB వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి, పెద్ద పెద్ద యాప్స్, ఫైల్స్ స్టోర్ చేసుకోవడానికి బోలెడు చోటు ఉంటుంది. 4,400mAh బ్యాటరీ, 25W ఫాస్ట్ ఛార్జింగ్‌తో రోజంతా ఫోన్ ఆగకుండా పనిచేస్తుంది.

* సాఫ్ట్‌వేర్, కెమెరాలు
ఈ ఫోల్డ్ 6 ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 సాఫ్ట్‌వేర్‌తో వస్తుంది. ఇందులో లేటెస్ట్ గెలాక్సీ AI ఫీచర్లు, చూడటానికి ఆకర్షణీయంగా ఉండే డిజైన్ మార్పులు ఉన్నాయి. కెమెరాల విషయానికొస్తే, వెనుకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. 50MP ప్రధాన కెమెరా OIS తో వస్తోంది.

50MP అల్ట్రా-వైడ్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి. దీంతో 3x ఆప్టికల్ జూమ్‌తో దూరం వస్తువులను కూడా స్పష్టంగా తీయొచ్చు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, కవర్ స్క్రీన్‌పై 10MP కెమెరా, మెయిన్ స్క్రీన్‌పై 4MP అండర్-డిస్‌ప్లే కెమెరా (అంటే కెమెరా డిస్‌ప్లే కింద ఉంటుంది, స్క్రీన్ చూస్తున్నప్పుడు అడ్డుగా కనిపించదు) ఉన్నాయి.

* ఇప్పుడు కొనడం మంచిదేనా..
మీరు ఒక టాప్ క్లాస్ ఫోల్డబుల్ ఫోన్ కోసం చూస్తుంటే, ఇందులో పనులు సులభంగా, వేగంగా చేసుకోవడానికి ఎన్నో ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్, కొత్త తరం AI టూల్స్ ఉన్నాయి. ఇంత భారీ ధర తగ్గింపు, అదనపు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో, శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 ప్రస్తుతం మార్కెట్లో ఉన్న బెస్ట్ ఫోల్డబుల్ ఫోన్లలో ఒకటిగా నిలుస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Z Fold 6 Gets Massive Rs35000 Price Cut on Amazon India: Check New Price, Features and Offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X