7.6 అంగుళాల డిస్‌ప్లే, 12GB ర్యామ్‌తో శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ విడుదల.. బుకింగ్ ప్రారంభం..
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 (Samsung Galaxy Z Fold 6 Smartphone Launched) మరియు గెలాక్సీ Z ఫ్లిప్ 6 ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్లు తాజాగా విడుదల అయ్యాయి. శాంసంగ్.. గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో వీటిని లాంచ్ చేసింది. ఈ రెండు ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ ఏఐ ఫీచర్లు సహా గూగుల్ సర్కిల్ టూ సెర్చ్ ఫీచర్, జెమిని AI చాట్‌బాట్‌ను సపోర్టు చేస్తాయి. ప్రస్తుతం ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లను ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చని మరియు జులై 24 నుంచి సేల్ ప్రారంభం కానుందని తెలిపింది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత శాంసంగ్ One UI 6.1.1 Skin పైన పనిచేస్తుంది. మరియు కస్టమ్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 గెలాక్సీ మొబైల్ ప్లాట్‌ఫాం పైన పనిచేస్తుందని తెలిపింది. 12GB ర్యామ్ వరకు, గరిష్ఠంగా 1TB స్టోరేజీ వరతు జతచేయబడి ఉంటుంది.

గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ 968*2378 పిక్సల్ రిజల్యూషన్‌తో 6.3 అంగుళాల HD+ డైనమిక్ అమోలెడ్ 2X Outer డిస్‌ప్లేను కలిగి ఉంది. డిస్‌ప్లే 410ppi పిక్సల్ డెన్సిటితో వచ్చింది. మరియు 1856*2160 పిక్సల్ రిజల్యూషన్‌తో 7.6 అంగుళాల QXGA+ డైనమిక్ అమోలెడ్ 2X ఇన్ఫినిటీ ఫ్లెక్స్ ఇన్నర్ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ రెండు డిస్‌ప్లేల అడాప్టి్వ్ రీఫ్రెష్ రేట్ 1Hz నుంచి 120Hz లుగా ఉంది.
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), f/1.8 అపేచర్ సహా డ్యూయల్ పిక్సల్ ఆటోఫోకస్ సపోర్టుతో 50MP వైడ్ యాంగిల్ కెమరాను కలిగి ఉంది. మరియు f/2.2 అపేచర్, 123 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 10MP టెలిఫోటో కెమెరాలను కలిగి ఉంది.

దీంతోపాటు కవర్ డిస్‌ప్లేపై f/2.2 అపేచర్‌తో 10MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇన్నర్ డిస్‌ప్లే పైన f/2.8 అపేచర్‌తో 4MP కెమెరాను కలిగి ఉంది. IP48 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా అందుబాటులోకి వచ్చింది. మరియు భద్రత కోసం ఈ హ్యాండ్‌సెట్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంటుంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 25W శాంసంగ్ వైర్ ఛార్జర్ సపోర్టుతో 4400mAh బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్ 2.0 మరియు వైర్‌లెస్ పవర్‌షేర్ సపోర్టును కలిగి ఉంటుంది. అయితే ఛార్జర్‌ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుందని శాంసంగ్ తెలిపింది.
ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.1,64,999 గా ఉంది. అదే 12GB ర్యామ్ +512GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.176999 గా ఉంది. 12GB ర్యామ్ + 1TB వేరియంట్ ధర రూ.2,00,999 గా ఉంది. నేవీ, పింక్, సిల్వర్ రంగుల్లో అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసేవారికి క్రాఫ్టెడ్ బ్లాక్, వైట్ రంగుల్లో కూడా లభిస్తుంది.
కనెక్టివిటీ పరంగా ఈ గెలాక్సీ Z ఫోల్డ్ 6 స్మార్ట్‌ఫోన్ 5G, 4G LTE, వైఫై 6E, బ్లూటూత్ 5.3, NFC వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు యాక్సిలిరోమీటర్, బారోమీటర్, గైరోస్కోప్, ఈ కంపాస్, హాల్ సెన్సార్, ప్రాక్సిమిటీ, యాంబియంట్ లైట్ సెన్సార్‌లను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








