Galaxy Unpacked 2025 : శాంసంగ్ గెలాక్సీ Z Fold 7 స్మార్ట్‌ఫోన్ విడుదల.. స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు..!
శాంసంగ్ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ 2025 ఈవెంట్‌లో భాగంగా ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్మార్ట్‌ఫోన్ ను (Samsung Galaxy Z Fold 7 Smartphone) విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ భారీ డిస్‌ప్లేతోపాటు అనేక ప్రత్యేక ఫీచర్లను కలిగి ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరంగానూ మెరుగైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్‌తో పాటు గెలాక్సీ Z ఫ్లిప్ 7, గెలాక్సీ Z ఫ్లిప్ 7 FE ఫోన్‌లను కూడా విడుదల చేసింది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్ల వివరాలు :
ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 8.0 అంగుళాల QXGA+ డైనమిక్ అమోలెడ్ 2X డిస్‌ప్లేను (2184 x 1968 పిక్సల్స్) కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, 368 ppi ను కలిగి ఉంది. దీంతోపాటు 120Hz రీఫ్రెష్ రేట్, 422 ppi తో 6.5 అంగుళాల ఫుల్ HD+ డైనమిక్ అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంది.

ఈ స్మార్ట్‌ఫోన్ కవర్ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ సిరామిక్ 2 ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. అదే బ్యాక్ ప్యానల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది. ఈ ఫోన్ అడ్వాన్స్‌డ్ ఆర్మర్ అల్యూమినియం ఫ్రేమ్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ ఫోల్డింగ్ సమయంలో 8.9 mm థిక్‌నెస్, అన్‌ఫోల్డ్ సమయంలో కేవలం 4.2 mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు 215 గ్రాముల బరువుంటుంది.
శాంసంగ్ గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్మార్ట్‌ఫోన్ శక్తివంతమైన క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 Elite చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత One UI 8 పైన పనిచేస్తుంది. గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్మార్ట్‌ఫోన్ 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ, 12GB ర్యామ్ + 512GB స్టోరేజీ, 16GB ర్యామ్ + 1TB స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్మార్ట్‌ఫోన్ f/2.2 అపేచర్, OIS (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) సపోర్టుతో 200MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు f/2.2 అపేచర్, 120 డిగ్రీల ఫీల్డ్ వ్యూతో 12MP అల్ట్రావైడ్ కెమెరాను కలిగి ఉంది.
దీంతోపాటు OIS, PDAF, f/2.4 అపేచర్, 3x ఆప్టికల్ జూమ్‌తో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. ఈ శాంసంగ్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ రెండు డిస్‌ప్లేలపై రెండు సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. కవర్ డిస్‌ప్లే పై 10MP, మరొక డిస్‌ప్లేపై 10MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ 4400mAh బ్యాటరీతో పనిచేస్తుంది. 25W వైర్ ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. 30 నిమిషాల్లో 50 శాతం ఛార్జింగ్ చేస్తుందని శాంసంగ్ చెబుతోంది. ఈ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ IP48 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్ 5.4, వైఫై 7 వంటి ఫీచర్లున్నాయి. దీంతోపాటు యాక్సెలిరోమీటర్, బారోమీటర్, జియోమాగ్నటిక్, గైరో సెన్సర్, హాల్ సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సర్, లైట్ వంటి సెన్సర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్ శాంసంగ్ Knox, శాంసంగ్ Knox Vault వంటి సెక్యూరిటీ ఫీచర్లను కలిగి ఉంది. ఈ ఫోన్ అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు కలిగి ఉన్నాయి.
గెలాక్సీ Z ఫోల్డ్ 7 స్మార్ట్‌ఫోన్ ధర వివరాలు వెల్లడి కాలేదు. త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ను ఇవాళ్టి నుంచే ముందస్తు బుకింగ్ చేసుకోవచ్చు. జులై 25 నుంచి సేల్ ప్రారంభం కానుంది.


Click it and Unblock the Notifications








