Home
Mobile

శాంసంగ్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్ల ఫ్యాన్‌ ఎడిషన్‌ మోడల్‌ వివరాలు లీక్‌.. ఎప్పుడు లాంచ్‌ కానున్నాయంటే?

శాంసంగ్‌ ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లు గెలాక్సీ Z ఫోల్డ్‌ 6, గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 ఈ సంవత్సరం విడుదల కానున్నాయి. అనంతరం ఈ రెండు హ్యాండ్‌సెట్ల ఫ్యాన్‌ ఎడిషన్‌లు (Samsung Galaxy Z Fold FE and Galaxy Z flip FE) కూడా విడుదల కానున్నాయి. టిప్‌స్టర్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ FE మరియు గెలాక్సీ Z ఫ్లిప్‌ FE ల వివరాలు కొన్ని లీక్‌ అయ్యాయి.

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ ప్లాట్‌ఫాం X ద్వారా టిప్‌స్టర్‌ Kro ఈ రెండు హ్యాండ్‌సెట్‌ల వివరాలను లీక్‌ చేశారు. ఈ రెండు ఫోల్డబుల్‌ ఫోన్లు కొన్ని మార్కెట్‌లలో క్వాల్‌కాం స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 ప్రాసెసర్‌.. అదే మరికొన్ని మార్కెట్‌లలో Exynos చిప్‌ను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫ్యాన్‌ ఎడిషన్ మోడళ్లలో ఒకటి మాత్రమే ప్రస్తుతం విడుదల కానుందని తెలిపారు.

samsung Galaxy Z Fold FE and Galaxy Z flip FE smartphone

శాంసంగ్ గెలాక్సీ Z ‌ఫ్లిప్‌ FE స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ లేదా 12GB ర్యామ్ మరియు 256GB లేదా 512GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అదే గెలాక్సీ Z ఫోల్డ్‌ FE హ్యాండ్‌సెట్‌ 12GB, 16GB స్టోరేజీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. 256GB మరియు 512GB స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్‌ గెలాక్సీ Z ఫోల్డ్‌ 6 మరియు గెలాక్సీ Z ఫ్లిప్‌ 6 హ్యాండ్‌సెట్‌లు జులై మధ్యలో విడుదల కానున్నాయి. అదే ఈ రెండు ఫ్యాన్ ఎడిషన్‌ మోడళ్లు సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌ నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే ఫ్యాన్‌ ఎడిషన్‌ మోడళ్ల విడుదలపై శాంసంగ్ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. మరియు స్పెసిఫికేషన్లపై సంస్థ అధికారిక ప్రకటన చెయ్యాల్సి ఉంది.

** శాంసంగ్‌ సంస్థ భారత్‌లో ఏప్రిల్‌ 8న గెలాక్సీ M55 5G, M15 5G స్మార్ట్‌ఫోన్లను విడుదల చేయనుంది. అయితే ఈ రెండు హ్యాండ్‌సెట్‌లకు సంబంధించిన స్పెసిఫికేషన్లు, ఫీచర్ల వివరాలు లీక్‌ అయ్యాయి. దీంతోపాటు శాంసంగ్‌ సంస్థ కూడా కొన్ని వివరాలు వెల్లడించింది.

శాంసంగ్ గెలాక్సీ M55 5G స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్ ప్లస్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ ను కలిగి ఉంటుంది. విజన్‌ బూస్టర్‌ టెక్నాలజీతో లాంచ్‌ కానుంది. మరియు మెరుగైన విజువల్‌ అనుభూతిని కలిగిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ 4nm స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 1 CPU ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. ఈ చిప్‌సెట్‌ మెరుగైన పనితీరును కనబరుస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 45W ర్యాపిడ్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. తక్కువ సమయంలో ఛార్జింగ్‌ చేయవచ్చని తెలుస్తోంది.

శాంసంగ్‌ గెలాక్సీ M15 5G స్మార్ట్‌ఫోన్‌ (Samsung Galaxy M15 5G Smartphone) 6.5 అంగుళాల సూపర్‌ అమోలెడ్‌ పుల్‌ HD ప్లస్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు మీడియాటెక్‌ డైమెన్సిటీ 6100+ చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌ 6000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

Best Mobiles in India

English summary
samsung Galaxy Z Fold FE and Galaxy Z flip FE smartphone details leaked
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X