Home
Mobile

200MP కెమెరా, 10 అంగుళాల భారీ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఛార్జింగ్‌తో శాంసంగ్‌ గెలాక్సీ Z ట్రైఫోల్డ్ స్మార్ట్‌ఫోన్

Samsung Galaxy Z TriFold Smartphone : శాంసంగ్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ ఎట్టకేలకు విడుదల అయింది. శాంసంగ్‌ గెలాక్సీ Z ట్రై ఫోల్డ్‌ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ 10 అంగుళాలు, 6.5 అంగుళాల డిస్‌ప్లేలను కలిగి ఉంది. స్నాప్‌డ్రాగన్ చిప్‌, టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంది. దీంతోపాటు వైర్‌లైస్‌ ఛార్జింగ్‌ సపోర్టును కూడా కలిగి ఉంది. ఈ ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్లు, సేల్‌ పూర్తి వివరాలు.

గెలాక్సీ Z ట్రైఫోల్డ్ ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
ఈ హ్యాండ్‌సెట్‌ 10 అంగుళాల QZGA+ డైనమిక్‌ అమోలెడ్ 2X ఇన్నర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టి్వ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ బ్రైట్‌నెస్‌, 269 ppi పిక్సల్‌ డెన్సిటి ను కలిగి ఉంది. కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ సిరామిక్‌ 2 ప్రొటెక్షన్‌ను పొందుతుంది.

Samsung Galaxy Z TriFold Smartphone

ఈ హ్యాండ్‌సెట్ 6.5 అంగుళాల ఫుల్‌ HD+ డైనమిక్‌ అమోలెడ్‌ 2x కవర్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz అడాప్టివ్‌ రీఫ్రెష్‌ రేట్‌, 2600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 422 ppi పిక్సల్‌ డెన్సిటీ, 21:9 యాస్పెక్ట్‌ రేషియో, 100 శాతం DCI-P3 కలర్ గామట్‌ను కలిగి ఉంది. అదే సిరామిక్‌ గ్లాస్ ఫైబర్‌ రీన్‌ఫోర్సడ్‌ పాలిమర్‌ ను కలిగి ఉంది.

క్వాల్‌కాం శక్తివంతమైన చిప్‌ :
ఈ శాంసంగ్ ట్రై ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ క్వాల్‌కాం ఆక్టా కోర్‌ 3nm స్నా్ప్‌డ్రాగన్ 8 ఇలైట్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌ 16GB ర్యా్మ్‌, 1TB స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత OneUI 8 పైన పనిచేస్తుంది.

Samsung Galaxy Z TriFold Smartphone

200MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ వెనుక వైపు ట్రిపుల్‌ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. ఇందులో ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 200MP ప్రైమరీ కెమెరా ఉంది. దీంతోపాటు 102 డిగ్రీల ఫీల్డ్‌వ్యూతో 12MP అల్ట్రావైడ్‌ కెమెరా మరియు 30X డిజిటల్‌ జూమ్‌, OIS సపోర్టుతో 10MP టెలిఫోటో లెన్స్‌ ఉంది. ఈ ఫోన్‌ కవర్‌, ఇన్నర్‌ డిస్‌ప్లే పైన 10MP సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.

వైర్‌లెస్‌ ఛార్జింగ్ :
గెలాక్సీ Z ట్రైఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ 15W వైర్‌లైస్‌ ఛార్జింగ్‌, 45W వైర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5600mAh బ్యాటరీతో పనిచేస్తుంది. అడ్వాన్సడ్‌ ఆర్మర్ అల్యూమినియంతో కూడిన టైటానియం హింజ్‌ హౌసింగ్‌ను కలిగి ఉంది. IP48 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

ఈ ఫోన్‌ సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ ఉంది. దీంతోపాటు బారో మీటర్, గైరో సెన్సర్‌, జియోమ్యాగ్నటిక్, యాక్సెలిరోమీటర్‌, హాల్‌ సెన్సర్‌, ప్రాక్సిమిటీ, లైట్ సెన్సర్‌లు ఉన్నాయి. కనెక్టివిటీ పరంగా 5G, 4G LTE, బ్లూటూత్‌ 5.4, వైఫై 7, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

ఎప్పుడు అందుబాటులోకి రానుంది? :
శాంసంగ్ గెలాక్సీ Z ట్రైఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్ ధర వివరాలను ప్రస్తుతానికి వెల్లడించలేదు. అయితే ఈ ఫోన్‌ ప్రస్తుతం దక్షిణ కొరియాలో మాత్రమే లాంచ్‌ అయింది. డిసెంబర్‌ 12 నుంచి సేల్‌ ప్రారంభం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. త్వరలో వివరాలను వెల్లడయ్యే అవకాశం ఉంది. క్రాఫ్టెడ్‌ బ్లాక్‌ ఫినిష్‌ వేరియంట్‌లో అందుబాటులోకి వచ్చింది.

గెలాక్సీ Z ట్రైఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ చైనా, అమెరికా, సింగపూర్‌, తైవాన్‌, UAE సహా ఇతర గ్లోబల్‌ మార్కెట్లలో తర్వాత లాంచ్‌ అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ హ్యాండ్‌సెట్ భారత్‌ విడుదలపై ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం వెల్లడి కాలేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung Galaxy Z TriFold Smartphone launched with 200MP Camera, snapdragon 8 elite chip
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X