శాంసంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ కీలక వివరాలు లీక్.. ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉందంటే..?
Samsung Galaxy TriFold Smartphone : శాంసంగ్ ట్రై ఫోల్డ్ ఫోన్ గురించి ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి. గతంలో ఈ ఫోన్ పేరులో అనేక లీక్స్ వచ్చాయి. అయితే చివరికి ఈ హ్యాండ్‌సెట్ శాంసంగ్ గెలాక్సీ Z ట్రై ఫోల్డ్ పేరుతో లాంచ్ కానుందని తెలిసింది. దీంతోపాటు ఈ ఫోన్ తొలి దశలో అన్ని మార్కెట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలిసింది. మరియు పరిమిత సంఖ్యలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉందని కూడా లీక్స్ వచ్చాయి.
అయితే తాజాగా శాంసంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ గురించి కీలక వివరాలు వెల్లడయ్యాయి. టిప్‌స్టర్ ఇవన్ బ్లాస్ @evleaks మైక్రో బ్లాకింగ్ ప్లాట్‌ఫాం X ద్వారా ఈ వివరాలను వెల్లడించారు. ఈ హ్యాండ్‌సెట్ శాంసంగ్ యునిక్ డిజైన్, అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ను ప్రతిబింబిస్తుందని తెలుస్తోంది.

శాంసంగ్ గెలాక్సీ Z ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ :
ఈ ట్రై ఫోల్డ్ శాంసంగ్ ఫోన్ 6.5 అంగుళాల కవర్ డిస్‌ప్లే, 10.0 అంగుళాల ఇన్నర్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. కలర్ డిస్‌ప్లే 2600 నిట్స్ బ్రైట్‌నెస్, ఇన్నర్ డిస్‌ప్లే 1600 నిట్స్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉండే అవకాశం ఉంది.
200MP కెమెరా! :
ఈ హ్యాండ్‌సెట్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ సిరీస్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ 200MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఫలితంగా కెమెరా విభాగం పరంగానూ ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్ 5437mAh బ్యాటరీతో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఇతర స్పెసిఫికేషన్‌ల వివరాలు తెలియాల్సి ఉంది.
Some confirmed details:
— Evan Blass (@evleaks) November 13, 2025
Final, retail branding: Galaxy Z TriFold.
Displays: 6.5" cover and 10.0" inner
Peak brightness: 2600 and 1600 nits, respectively
Thickness of the leaves varies: 3.9/4.0/4.2mm
Main camera: 200MP
Rated battery capacity: 5437mAh
Powered by SD
తొలుత ఈ మార్కెట్లలో మాత్రమే :
శాంసంగ్ ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం చివరలోగా విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే తొలి దశలో కొరియా, ఆసియా మార్కెట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. భారత కరెన్సీ ప్రకారం ధర సుమారుగా USD 3000 ( భారత కరెన్సీ ప్రకారం రూ.2,66,380 ) గా ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది? :
అయితే ఈ స్మార్ట్‌ఫోన్ ను ఈ సంవత్సరంలోనే లాంచ్ చేస్తామని శాంసంగ్ గతంలోనే తెలిపింది. గతంలో టిప్‌స్టర్ ఐస్ యూనివర్స్ ఈ ఫోన్ ఈ సంవత్సరం అక్టోబర్ లో లాంచ్ కానుందని చెప్పారు. అయితే విడుదల కాలేదు. ప్రస్తుతం ఉన్న వివరాల ఆధారంగా ఈ ట్రై ఫోల్డ్ మోడల్ డిసెంబర్ 5 వ తేదీన లాంచ్ అయ్యే అవకాశం ఉంది.
గెలాక్సీ Z ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ విడుదల అయిన అనంతరం ఎంపిక చేసిన మార్కెట్లలో సేల్ కూడా ప్రారంభం కానుందని తెలుస్తోంది. వివిధ కారణాల వల్ల ఈ హ్యాండ్‌సెట్ పరిమిత సంఖ్యలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని గతంలో వార్తలు వచ్చాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే ఈ వివరాలపై శాంసంగ్ ఎటువంటి ప్రకటన చేయలేదు.


Click it and Unblock the Notifications








