సామ్‌సంగ్ గేర్ 2 స్మార్ట్‌వాచ్‌ (విశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

|

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2014 టెక్నాలజీ ట్రేడ్ షో వేదికగా సామ్‌సంగ్ ఆవిష్కరించిన స్మార్ట్‌వాచ్ సామ్‌సంగ్ గేర్ 2. సామ్‌సంగ్ గేర్ స్మార్ట్‌వాచ్‌కు అప్‌డేటెడ్ వర్షన్‌గా విడుదలైన గెలాక్సీ గేర్ 2 స్మార్ట్‌వాచ్ రెండు వేరియంట్‌లలో లభ్యమవుతోంది. వీటిలో మొదటి వేరియంట్ గెలాక్సీ గేర్ 2, రెండవ వేరియంట్ గెలాక్సీ గేర్ 2 నియో (ఈ వేరియంట్‌లో కెమెరా ఫీచర్ ఉండదు). ఈ రెండు స్మార్ట్‌వాచ్‌లు సామ్‌సంగ్, ఇంటెల్ సంయుక్తంగా రూపొందించిన లైనెక్స్ ఆధారిత టైజన్ ఆపరేటింగ్ సిస్టి పై స్పందిస్తాయి.

 
 సామ్‌సంగ్ గేర్ 2 స్మార్ట్‌వాచ్‌ (విశ్లేషణాత్మక వీడియో రివ్యూ)

గేర్ 2 స్మార్ట్‌వాచ్‌లో స్పోర్ట్స్ ట్రాకింగ్ టెక్నాలజీ, హార్ట్‌రేట్ మానిటర్ వంటి ప్రత్యేకమైన ఫీచర్లను సామ్‌సంగ్ నిక్షిప్తం చేసింది. ఈ ఫీచర్ల ద్వారా ఫిట్నెస్ అలానే గుండె వేగానికి సంబంధింత వివరాలను తెలుసుకోవచ్చు. టైజెన్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ స్మార్ట్ వాచ్‌రన్ అవుతుంది. బ్లూటూత్ కనెక్టువిటీ సాయంతో ఈ స్మార్ట్‌వాచ్‌ను ఫోన్‌కు అనుసంధానించుకోవల్సి ఉంటుంది. తద్వారా మీ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చిన ఈ మెయిల్స్‌ను, సందేశాలను, అలర్ట్‌లను స్మార్ట్ వాచ్ లోనే వీక్షించవచ్చు. ఫోన్ కాల్స్‌ను కూడా సమీక్షించవచ్చు. ఇందుకుగాను 1.63 అంగుళాల స్ర్కీన్‌ను స్మార్ట్‌వాచ్ ఫై భాగంలో ఏర్పాటు చేసారు. స్మార్ట్‌వాచ్‌ను టీవీ తదితర డివైస్‌లకు రిమోట్ కంట్రోల్‌గా కూడా ఉపయోగించుకోవచ్చు 2 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఈ స్మార్ట్‌వాచ్ కలిగి ఉంది.

సామ్ సంగ్ గేర్ 2 స్మార్ట్ వాచ్ స్పెసిఫికేన్‌లను పరిశీలించినట్లయితే... లైనెక్స్ ఆధారిత టైజన్ ఆపరేటింగ్ సిస్టం, 1.63 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 320 X 320పిక్సల్స్), 1గిగాహెట్జ్ డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ మెమెరీ, యాక్సిలరోమీటర్, గైరో సెన్సార్, హార్ట్‌రేట్ సెన్సార్, స్మార్ట్‌వాచ్‌లను యూనివర్సల్ రిమోట్ కంట్రోల్‌లా ఉపయోగించుకునేందుకు ఐఆర్ ఎల్ఈడి పోర్ట్‌ను నిక్షిప్తం చేసారు. 2 మెగా పిక్సల్ కెమెరాను గేలాక్సీ గేర్ 2లో నిక్షిప్తం చేసారు. గేర్ 2 నియో వేరియంట్లో కెమెరా ఫీచర్ లోపించింది. గెలాక్సీ గేర్ 2 స్మార్ట్‌వాచ్ మెటల్ బాడీని కలిగి ఉండగా, గేర్ 2 నియో వేరియంట్ ప్లాస్టిక్ బాడీని కలిగి ఉంటుంది. ఈ రెండు వేరియంట్‌లు ఐపీ67 సర్టిఫికేషన్ కలిగి వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ వ్యవస్థలను కలిగి ఉన్నాయి.

సామ్‌సంగ్ గేర్ 2 స్మార్ట్‌వాచ్ ను samsungindiaestore రూ.21,550కి విక్రయిస్తోంది. కొనుగోలు చేసేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ గేర్ 2 స్మార్ట్‌వాచ్ పనితీరుకు సంబంధించిన విశ్లేషణాత్మక రివ్యూను క్రింది వీడియోలో చూడొచ్చు...

<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/JH-1RX5yruA?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center>

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X