సామ్‌సంగ్ ఫిట్నెస్ ట్రాకర్ పై రూ.3,350 ధర తగ్గింపు

Posted By:

మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా సామ్‌సంగ్ విడుదల చేసిన హైబ్రీడ్ ఫిట్నెస్ ట్రాకర్ గేర్ ఫిట్ ( Gear Fit) ఇండియన్ మార్కెట్లో ధర తగ్గింపును అందుకుంది. రూ.15,540 ధర ట్యాగ్ పై లభ్యమవుతోన్న గెలాక్సీ గేర్ ఫిట్నెస్ ట్రాకర్‌ను తాజాగా సామ్‌సంగ్ రూ.12,100కు సొంతం చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజా ధర తగ్గింపులో భాగంగా సామ్‌సంగ్ గేర్ ఫిట్ స్మార్ట్‌వాచ్ కొనుగోలు పై వినియోగదారుడు రూ.3,350 వరకు రాయితీని పొందవచ్చు. సామ్‌సంగ్ ఇండియన్ అధికారిక ఆన్‌లైన్ స్టోర్ వద్ద ఈ ఆఫర్‌ను అందబాటులో ఉంచారు. సద్వినియోగం చేసుకునేందుకు క్లిక్ చేయండి.

సామ్‌సంగ్ ఫిట్నెస్ ట్రాకర్ పై రూ.3,350 ధర తగ్గింపు

సామ్‌సంగ్ గేర్ 2, గేర్ 2 నియో స్మార్ట్‌వాచ్‌లకు తరువాతి వర్షన్‌గా విడుదలైన వేరబుల్ గాడ్జెట్ సామ్‌సంగ్ గేర్ ఫిట్. రిస్ట్ బ్యాండ్ తరాహాలో రూపకల్పన చేయడిన ఈ డివైస్‌ను ఫిట్నెస్ బ్యాండ్ అలానే స్మార్ట్‌వాచ్‌లా ఉపయోగించుకోవచ్చు. అద్భుతంగా డిజైన్ కాబడిన సామ్‌సంగ్ గేర్ ఫిట్ డస్ట్ ప్రూఫ్ అలానే వాటర్ ప్రూఫ్ సామర్థ్యాలను కలిగి ఉంది. ఈ గాడ్జెట్ బరువు 27 గ్రాములు. సింగిల్ చార్జ్ పై 72 గంటల పాటు ఈ స్మార్ట్‌వాచ్ అంతరాయం లేకుండా పనిచేస్తుంది.

ఈ స్మార్ట్ డివైస్ ద్వారా మీ ఫిట్నెస్‌కు సంబంధించిన వివరాలను తెలుసుకోవటంతో పాటు మీ స్మార్ట్‌ఫోన్‌కు వచ్చిన ఈ మెయిల్స్‌ను, సందేశాలను, అలర్ట్‌లను వీక్షించవచ్చు, ఫోన్ కాల్స్‌ను రిసీవ్ లేదా కట్ చేసుకోవచ్చు. ఇందుకుగాను 1.84 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేను వాచ్ పై భాగంలో ఏర్పాటు చేసారు. ఈ రిస్ట్ బ్యాండ్‌లో నిక్షప్తం చేసిన ఎస్ హెల్త్ అప్లికేషన్ మీ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది. బ్లూటూత్ ద్వారా ఈ రిస్ట్ బ్యాండ్‌ను స్మార్ట్‌ఫోన్‌కు కనెక్ట్ చేసుకోవల్సి ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot