శ్యామ్‌సంగ్ ఐ8350 మార్కెట్లో హిట్ కొట్టనుందా..?

By Super
|
Samsung GT
ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ రంగ మార్కెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న శ్యామ్‌సంగ్ వినూత్న ప్రయోగాలతో వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.టాప్ 10మొబైల్ కంపెనీల్లో మాడో స్థానంలో నిలిచిన ఈ హాట్ బ్రాండ్ నాణ్యతకు మారుపేరుగా నిలుస్తుంది. ఖతాదారుల సౌలభ్యమే లక్స్యంగా సాధారణ మొబైల్స్ మొదలుకుని స్మార్ట్ ఫోన్ల వరకు ఉత్పత్తులు నిర్వహిస్తున్న సామ్ సంగ్ భారతీయ మార్కెట్లో భేష్ అనిపించుకుంటుంది.

స్మార్టఫోన్ల మార్కెట్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆండ్రాయిడ్ , ఆపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌ల దూకుడుకు కళ్లేం వేయటంతో పాటు ప్రపంచ స్మార్ట్ ఫోన్ మార్కట్లో తమ హవాను కొనసాగించేందుకు మైక్రోసాఫ్ట్ న్యూ విండోస్ ఫోన్ 7మ్యాంగో ఆపరేటింగ్ సిస్టంను మార్కెట్లో విడుదల చేసేందుకు శ్యామ్‌సంగ్ తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం మేరకు శ్యామ్‌సంగ్ విండోస్ 7 మ్యాంగో డివైజ్ తయారీ పై గత కొంత కాలం నుంచే అధ్యయనం నిర్వహిస్తున్న శ్యామ్‌సంగ్ విడుదల చేసే స్మార్ట ఫోన్ కు సంబంధించి ఎటువంటి సమాచారాన్ని విడుదల చేయలేదు. ఏదేమైనప్పటికి ఈ ఫోన్ కు సంబంధించి పలు ప్రధాన అంశాలను తెలుసుకుందాం.

అత్యాధునిక విండోస్ 7 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టం సాంకేతికతో రూపుదిద్దుకుంటున్న ఈ మోడల్ పేరు శ్యామ్‌సంగ్ జీటీ - ఐ8350, మార్కెట్లో విడుదలైన శ్యామ్‌సంగ్ ఒమానియా 7 జీటీ - ఐ8700కి సక్సెస్ గా భావించ వచ్చు. తొలుత ఈ ఫోన్ కి శ్యామ్‌సంగ్ ఐ937నామకరణం చేద్దామని నిర్ణయించినా చివరికి శ్యామ్‌సంగ్ జీటీ - ఐ8350గానే నిర్థారించారు. అనేక ఆకాంక్షల మధ్య రూపుదిద్దు కుంటున్న శ్యామ్‌సంగ్ జీటీ - ఐ8350 ఈ ఏడాది చివరిలో మర్కెట్లోకి అందుబాటులోకి రానుంది. తయారీ దారులు మాత్రం విండోస్ బేసిడ్ 7 మ్యాంగో ఆపరేటింగ్ సిస్టంకు ప్రపంచ వ్యాప్తంగా మంచి స్పందనే లభిస్తుందని గట్టి నమ్మకమే పెట్టకున్నారు.

శ్యామ్‌సంగ్ జీటీ-ఐ8350 480 x 800 పిక్స్ ల్ సామర్ఢ్యంతో నాణ్యమైన విజివల్ ఎక్స్ పీరియన్స్ ను చూపురులకు అందిస్తుంది. ఇంటెర్నెట్ ఎక్స్ప ప్లోరర్ 9 బ్రౌజర్ సామర్థ్యంతో కూడిన ఈ స్మార్ట్ ఫోన్ కు మరిన్ని ఆకర్షణీయమైన సదుపాయాలు వాడకందారులకు కల్పించనుంది. మైక్రో సాఫ్ట్ వర్గాల సమాచారం మేరకు అత్యున్నత ప్రమాణాలాతో రూపుదిద్దు కుంటున్న విండోస్ ఫోన్ 7 మ్యాంగో మరో రెండు నెలల్లో మార్కటెలోకి అందుబాటులోకి రావచ్చని తెలుస్తోంది. మొబైల్ తో కూడిన ఆపరేటింగ్ సిస్టంను మొట్టమొదటిగా నోకియా మార్కెట్ లో విడుదుల చేస్తే దాన్ని అనుకరిస్తున్న శ్యామ్‌సంగ్ ఆపరేటింగ్ సిస్టంతో కూడిన శ్యామ్‌సంగ్ జటీ - ఐ8350ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X