అయ్య బాబోయ్.. కలెక్షన్ల వర్షమే!!

By Super
|
Samsung gets 9 million pre-orders for Galaxy S3


సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ విడుదలవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 2011లో విడుదలైన సామ్‌‌సంగ్ గెలాక్సీ ఎస్2, 2012 ఫిబ్రవరి నాటికి 20 మిలయన్ యూనిట్లు అమ్మకాలను క్రాస్ చేసింది. ఇండస్ట్రీలో ఈ విషక్యం నిన్న మొన్నటి వరకు సంచలనమే. ఈ సిరీస్ తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్ 3, నెల దాటక ముందే 9 మిలియన్ల యూనిట్లకు సంబంధించి ప్రీఆర్డర్లను దక్కించుకుంది!.

ఈ సమచారాన్ని స్వయానా సామ్‌సంగ్‌కు చెందిన ఓ అధికారి కొరియా ఎకనామిక్ డైలీకి వెల్లడించినట్లు తెలిసింది. గెలాక్సీ ఎస్3 అమ్మకాల విషయంలో గెలాక్సీ ఎస్2ను మించిపోవటమే కాకుండా స్మార్డ్‌ఫోన్ సెగ్మెంట్‌లో సరికొత్త రికార్డులన నెలకొల్పనుందని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గెలాక్సీ ఎస్3కి దక్కిన 9 మిలియన్ల ప్రీ ఆర్డర్లు 145 దేశాలకు చెందిన 290 మొబైల్ ఆపరేటర్ల నుంచి వచ్చినట్లు వినికిడి. అయితే, ఈ వివరాలను సామ్‌సంగ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.

అత్యాధునిక సాంకేతిక ఫీచర్లతో సుసంపన్నమైన ‘గెలాక్సీ ఎస్3’ జూన్ తొలివారం నుంచి ఇండియాలో లభ్యం కానుంది. యూరోప్‌లో మే29నే ఈ హ్యాండ్‌సెట్ విడుదల కానుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 16జీబి, 32జీబి, 64జీబి మెమెరీ వేరింయట్‌లలో లభ్యం కానుంది. రూ.38,000 నుంచి రూ.42,500 ధరల మధ్య వీటిని విక్రియించనున్నారు. ప్రత్యేకించి ఈ ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్ కోసం సామ్‌సంగ్ పలు ఉపకరణాలను లాంచ్ చేసింది. ఈ జాబితలో ఎస్ పెబ్బిల్ ఎంపీత్రీ ప్లేయర్, వైర్ లెస్ ఛార్జింగ్ కిట్, బ్యాటరీ స్టాండ్ తదితర అంశాలు ఉన్నాయి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X