జాబ్స్ చనిపోవడంతో ఈవెంట్ లండన్‌కు మారింది..

Posted By: Staff

జాబ్స్ చనిపోవడంతో ఈవెంట్  లండన్‌కు మారింది..

శ్యామ్‌సంగ్, గూగుల్ రెండింటి భాగస్వామ్యంతో గెలాక్సీ నెక్సస్ స్మార్ట్ ఫోన్‌ని అక్టోబర్ మొదటి వారంలో శాన్ డియిగోలో జరిగే సాప్ట్ వేర్ సిటిఐఎ ఈవెంట్లో విడుదల చేయాలని నిర్ణయించుకున్న విషయం అంతక ముందు వన్ ఇండియా పాఠకులకు తెలియజేశాం. కానీ ఈ గెలాక్సీ నెక్సస్ స్మార్ట్ ఫోన్‌ విడుదలని సడన్‌గా అక్బోటర్ 27వ తారీఖుకి వాయిదా వేయడం జరిగిందని తెలియజేస్తున్నాం. ఈ వాయిదాకి కారణం ప్రఖ్యాత ఐఫోన్ పితామహుడు, యాపిల్ కంపెనీ సహావ్యవస్దాపకుడు స్టీవ్ జాబ్స్ మృతే కారణమని అంటున్నారు.

ఐతే ఈ సిటిఐఎ ఈవెంట్‌ని ఎక్కవ కాలం వాయిదా వేయలేదని కూడా స్పష్టం చేశారు. శ్యామ్ సంగ్, గూగుల్ కలయికతో విడుదల చేయనున్న ఈ నెక్సస్ స్మార్ట్ ఫోన్‌ని అక్టోబర్ 27న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పుడు లోకేషన్ కూడా మార్పు చేయడం జరిగింది. ఈ ఈవెంట్‌ని లండన్‌లో నిర్వహించాలని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమంలోనే శ్యామ్ సంగ్, గూగుల్ వాటియొక్క కొత్త హార్డ్ వేర్, సాప్ట్ వేర్ ఉత్పత్తులను ప్రపంచ జనాభాకు రుచి చూపించనున్నాయి. ఇలాంటి ఈవెంట్స్ కొసం ప్రత్యేకంగా టెక్నాలజీ నిపుణులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు.

గూగుల్, శ్యామ్ సంగ్ నెక్సస్ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి ఎటువంటి అఫీసియల్ సమాచారం కంపెనీ వెలువడించ లేదు. గెలాక్సీ నెక్సస్ మొబైల్‌కి సంబంధించిన సమాచారం పాఠకుల కొసం ప్రత్యేకంగా..

గెలాక్సీ నెక్సస్ ప్రత్యేకతలు

* Height: 119mm
* Width: 59.8mm
* Depth: 11.5mm
* Weight:130 grams w/battery

డిస్ ప్లే

* 4.65-inch 1280 x 720 pixel Super AMOLED HD display
* 100,000:1 typical contrast ratio
* 1ms typical response rate

కెమెరా

* 5 megapixels
* Autofocus from 6cm to infinity
* 2X digital zoom
* LED flash
* User can include location of photos from phone’s AGPS receiver
* Video captured at 720x480 pixels at 20 frames per second or higher

నెట్ వర్క్ ఫీచర్స్

* 3 UMTS Bands (either 900/AWS/2100 MHz or 850/1900/2100 MHz)
* HSDPA 7.2Mbps
* HSUPA 2Mbps
* GSM/EDGE (850, 900, 1800, 1900 MHz)
* Wi-Fi (802.11b/g)
* Bluetooth 2.1 + EDR
* A2DP stereo Bluetooth

పవర్ అండ్ బ్యాటరీ

* Removable 1400 mAH battery
* Charges at 480mA from USB, at 980mA from supplied charger

ప్రాసెసర్

* Qualcomm QSD 8250 1 GHz

ఆపరేటింగ్ సిస్టమ్

* Android Mobile Technology Platform 2.1 (Eclair)

మొమొరీ కెపాసిటీ

* 512MB Flash
* 512MB RAM
* 4GB Micro SD Card (Expandable to 32 GB)

సెన్సార్స్

* Assisted global positioning system (AGPS) receiver
* Cell tower and Wi-Fi positioning
* Digital compass
* Accelerometer
* Proximity Sensor
* Light Sensor

దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను త్వరలో వన్ ఇండియా మొబైల్‌లో ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే ధరని ఇంకా ఇండియన్ మొబైల్ మార్కెట్లో వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot