లీకైన ఇమేజి, ఇంటర్నెట్లో కలకలం...

Posted By: Staff

లీకైన ఇమేజి, ఇంటర్నెట్లో కలకలం...

 

శాంసంగ్ నాణ్యమైన స్మార్ట్ ఫోన్స్‌ని అందించే కంపెనీ. ఎలక్ట్రానిక్స్ రంగంలోనే కాకుండా, మొబైల్ రంగంలో స్మార్ట్ ఫోన్స్‌ని విడుదల చేసి ఓ నూతన ఒరవడిని సృష్టించింది. విడుదల చేసిన ప్రతి ఉత్పత్తిలోను తనదైన ముద్రని వేయడమే కాకుండా, మార్కెట్లో నెంబర్ వన్ స్దానాన్ని సొంతం చేసుకుంది. ఇది ఇలా ఉంటే శాంసంగ్ త్వరలో మొబైల్ మార్కెట్లోకి విడుదల చేయనున్న 'శాంసంగ్ జిటి- ఎస్7500' మొబైల్ ఫోన్ ఇమేజిలు ఇంటర్నెట్లో లీకై కలకలం సృష్టిస్తున్నాయి. 'శాంసంగ్ జిటి- ఎస్7500' మొబైల్ ఫోన్ అచ్చం శాంసంగ్ గెలాక్సీ ఎస్ మాదిరే ఉండడంతో అభిమానులలో అంచనాలు ఎక్కువై పోతున్నాయి.

'శాంసంగ్ జిటి- ఎస్7500' మొబైల్ ఫోన్ సుపిరియర్ క్వాలిటీ డిస్ ప్లేతో షైనీ ప్లాస్టిక్ అవుట్ లైన్‌ని కలిగి ఉండి చూపరులకు నచ్చే విధంగా రూపొందించడం జరిగింది. శాంసంగ్ గతంలో విడుదల చేసిన హై ఎండ్ మొబైల్స్‌లో ఉన్న పెద్ద 'హోం' బటన్ ఇందులో కూడా నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్ ప్రియులు ఆనందించతగ్గ మరొక విషయం ఏమిటంటే 'శాంసంగ్ జిటి- ఎస్7500' మొబైల్ ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బ్రెడ్ ఆపరే టింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండడం వల్ల ఆండ్రాయిడ్ మార్కెట్లో ఉన్న అన్ని రకాల అప్లికేషన్స్‌ని కూడా డౌన్ లోడ్ చేసుకొవచ్చు.

కనెక్టివిటీ, కమ్యూనికేషన్ ఫీచర్స్ విషయానికి వస్తే యుఎస్‌బి పోర్ట్, యుఎస్‌బి, వై - పై లను సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌ని బయట స్పీకర్స్‌కి కనెక్టు చేసుకునేందుకు గాను మొబైల్‌తో పాటు 3.5mm ఆడియో జాక్ ప్రత్యేకం. సుపీరియర్ వీడియో అవుట్ పుట్ కోసం ఇందులో HDMI అవుట్ పుట్‌ని ప్రత్యేకంగా నిక్షిప్తం చేయడం జరిగింది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరా సహాయంతో అందమైన పోటోలను తీయవచ్చు. ఎల్‌ఈడి ఫ్లాష్ కెమెరా ప్రత్యేకం. మేసేజింగ్ పీచర్స్ విషయానికి వస్తే sms, mms, e-mail లాంటి అన్నిరకాల వాటిని సపోర్ట్ చేస్తుంది. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే మార్కెట్లో లభించే MP3, MPEG4, AAC+ ఫార్మెట్లను సపొర్ట్ చేస్తుంది. మొబైల్ బరువు, చుట్టుకొలతలు లాంటి ప్రత్యేకతలు ఇంకా వెల్లడించ లేదు. త్వరలో శాంసంగ్ జిటి- ఎస్7500 మొబైల్‌కి సంబంధించిన సమాచారం పూర్తిగా పాఠకులకు అందజేయడం జరుగుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot