శ్యామ్‌సంగ్ విపణి నుండి కొత్త డ్యూయల్ సిమ్ పోన్ Samsung Ch@t 222

Posted By: Staff

శ్యామ్‌సంగ్ విపణి నుండి కొత్త డ్యూయల్ సిమ్ పోన్ Samsung Ch@t 222

శ్యామ్‌సంగ్ ప్రపంచంలో చెప్పుకోదగ్గ మొబైల్ మోడళ్లను ఉత్పత్తి చేసే మొబైల్ తయారీ సంస్ద. ప్రపంచం మొత్తం మీద 160 దేశాలలో తన కార్యకలాపాలను కోనసాగిస్తుంది. దీనితోపాటు గ్లోబల్ మార్కెట్‌ మొబైల్ హ్యాండ్ సెట్‌‌లో 20శాతం షేర్‌ని ఆక్రమించింది. తక్కువ ధరలో ఎక్కువ కాలం వచ్చేటటువంటి తన ఉత్పత్తులను ప్రపంచ వ్యాప్తంగా అందించి మొబైల్ మార్కెట్‌లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సంస్ద. శ్యామ్‌సంగ్ కంపెనీ ఒక్క మద్యతరగతి కుటుంబాలనే కాకుండా బేసిక్ నుండి మల్టీమీడియా, హైఎండ్ మొబైల్ పోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసి తన సత్తాని చాటుతుంది. ఇది మాత్రమే కాకుండా ఇండియాలో కామన్ మ్యాన్ మనసు దోసుకున్నటువంటి మొబైల్ తయారీ సంస్ద శ్యామ్‌సంగ్ అనడంలో ఎటువంటి సందేహాం లేదు.

రాబోయే కాలంలో ఇండియన్ మొబైల్ మార్కెట్‌కి మంచి భవిష్యత్తు ఉండడంతో మొబైల్ కంపెనీలు చూపులు అన్ని ఇండియా మీద పడ్డాయి. అందులో భాగంగా శ్యామ్‌సంగ్ తన అమ్ముల పోదినుండి మరో రెండు కొత్త చాటింగ్ సిరిస్ మొబైల్స్‌ని మార్కెట్ లోకి విడుదల చేస్తుంది. ఆ రెండు చాటింగ్ సిరిస్ ఫోన్సే Samsung Ch@t 222, Ch@t 335. శ్యామ్‌సంగ్ ప్రవేశపెట్టినటువంటి ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా మల్టీమీడియా ఫోన్స్ అవ్వడంతో పాటు బడ్డెట్ ఫోన్స్. ఇక శ్యామ్‌సంగ్ Ch@t 222 విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ ఫోన్. మంచి విజువల్ ఎక్సీపీరియన్స అందజేస్తుంది.

శ్యామ్‌సంగ్ Ch@t 335 విషయానికి వస్తే డ్యూయల్ సిమ్ పోన్ కాకపోయినప్పటికీ క్వర్టీ ఫిజికల్ కీప్యాడ్ సదుపాయం ఉంది. 2.4 ఇంచ్ డిప్లే కలిగి ఉండి చూడడానికి చాలా అందంగా ఉంటుంది. 2మెగా ఫిక్సల్ కెమెరా ఉండి ఫోటోలను తీయడానకి చాలా అనుకూలంగా ఉంటుంది. ఐతే శ్యామ్‌సంగ్ Ch@t 222లో 2.2ఇంచ్ డిప్లే సదుపాయం మాత్రమే ఉంది. ఇక కెమెరా కూడా సాధారణమైన విజిఎ కెమెరా. ఇక ఖరీదు విషయానికి వస్తే శ్యామ్‌సంగ్ Ch@t 222 ధర కేవలం రూ 3729, అదే విధంగా Ch@t 335 ధర కేవలం రూ 4750 మాత్రమే.

Samsung Ch@t 222 Specifications:

* Network: SIM 1 GSM 850 / 900 / 1800 / 1900; SIM 2 GSM 850 / 900 / 1800 / 1900;
* Dimensions: 109.5 x 61.3 x 11.9 mm Weight: 90 grams;
* Screen: 2.2 inch, TFT, 220 x 176 pixels;
* Keyboard: QWERTY
* Camera: VGA, 640

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting