శ్యామ్‌సంగ్ కొత్త స్మార్ట్ ఫోన్ హెర్కులస్

By Super
|
Samsung Hercules
ప్రపంచంలోని మొబైల్ మార్కెట్లో శ్యామ్‌సంగ్ బ్రాండ్‌ది ఓ ప్రత్యేకమైన స్దానం. ఒకరకంగా చెప్పాలంటే స్మార్ట్ ఫోన్స్‌ని ప్రపంచానికి పరిచయం చేసింది శ్యామ్‌సంగేనని అనాలి. ఇటీవలే శ్యామ్‌సంగ్ కంపెనీ గేమింగ్ మొబైల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసే విషయంలో ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుండి ఆమోదం పోందింది. దాంతో శ్యామ్‌సంగ్ కంపెనీ నుండి త్వరలో గేమింగ్ మొబైల్స్ మార్కెట్లోకి రానున్నాయి. ప్రపంచంలో ఎక్కువ కస్టమర్‌ని పోందినటువంటి మొబైల్ తయారీదారు సంస్ద శ్యామ్‌సంగ్ ప్రపంచంలో ఐదవ స్దానంలో ఉంది. ఐదవ స్దానం ఊరికే తమకు రాలేదని దావివెనుక అవరళ కృషి ఉందని తెలియజేశారు. కస్టమర్స్‌కు తమ ఉత్పత్తులను అందించడమే కాకుండా వాటికి తగినటువంటి సర్వీస్ కూడా అందుబాటులో ఉండేటట్లు చేయడం జరిగిందన్నారు.

శ్యామ్‌సంగ్ తన ఉత్పత్తులకు పెట్టేటటువంటి పేర్లు చాలా ఉన్నతంగా ఉంటాయి. ఉదాహారణకు శ్యామ్‌సంగ్ గెలాక్సీ అనే పేరులోనే ఆ మొబైల్ యొక్క రాజసం కనిపిస్తుంది. అదేవిధంగా శ్యామ్‌సంగ్ త్వరలో విడుదల చేయనున్నటువంటి కొత్త స్మార్ట్ ఫోన్ పేరు శ్యామ్‌సంగ్ హెర్కులస్. శ్యామ్‌సంగ్ ఈ మొబైల్‌కి ఈ పేరు పెట్టడానికి కారణం పూర్వం భూమి మీద ఉన్నటుపవంటి గొప్ప వ్యక్తులలో లార్డ్ హెర్కులస్ అనే ఆయన పవర్ పుల్. శరీర సౌష్ఠవానికి, శక్తి సామర్ధ్యాలకు చిహ్నాం ఆయన. అందుకే ఆయన పేరు మీద కోత్తగా విడుదల చేయనున్నవంటి మొబైల్‌కి శ్యామ్‌సంగ్ హెర్కులస్ అనే పేరుని పెట్టడం జరిగిదంన్నారు.

ప్రస్తుతం శ్యామ్‌సంగ్ హెర్కులస్ తయారీ స్టేజిలో ఉందని రూమర్స్ వస్తున్నాయి. ఐతే ఇది ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పవర్ మొబైల్‌‌గా చూచిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఏమేమి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయో, అవి ఏమేమి కొత్త ఫీచర్స్ అందిస్తున్నాయో అవన్ని కూడా ఇందులో పోందుపరచబడి ఉంటాయని నిపుణుల అంచనా. ఇక ఈ మొబైల్ అమెరికాలో ఈ సెప్టెంబర్‌లో విడుదలవుతున్నట్లు సమాచారం. ఐతే ఇండియన్ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనేది తెలియదు. ఈ స్మార్ట్ ఫోన్ గురించి మార్కెట్లో వచ్చిన రూమర్స్ ప్రకారం ఈ మొబైల్ అన్ని రకాల వీడియో ఫార్మెట్స్‌లను సపోర్ట్ చేయడమే కాకుండా వీడియో రికార్డింగ్, ప్లేబ్యాక్ లను కూడా సపోర్ట్ చేస్తుంది.

శ్యామ్‌సంగ్ హెర్కులస్ కమ్యూనికేషన్, కనెక్టివిటీ టెక్నాలజీలు అయిన బ్లూటూత్, వై-పై, 2జి, 3జి లను సపోర్ట్ చేస్తుంది. 3జి ఇంటర్నెట్‌లో డేటా ట్రాన్ఫర్ అనేది సుమారుగా 14 Mbpsగా ఉంటుంది. ఇందులో మొబైల్‌తో పాటు ఇంటర్నల్ మొమొరీ ఉండగా, ఎగస్ట్రాగా దీనిని విస్తరించుకునేందుకు ఇందులో మైక్రో ఎస్‌డి అమర్చడం జరిగింది. మల్టీ టాస్కింగ్ పనులు చేయడానికి ఇందులో పవర్ పుల్ ప్రాసెసర్ పోందుపరచడం జరిగింది.

The list of rumoured specifications of the Samsung Hercules:

4 inch Touch Screen display
8 Mega Pixel camera with 1080p video recording
Android Gingerbread OS
4G, 3G and 2G support
Bluetooth and Wi-Fi
Java

ఇక దీని ఖరీదు విషయానికి వస్తే ప్రస్తుతం వెల్లడించలేదు. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం వన్ ఇండియా మొబైల్‌‌కి టచ్‌లో ఉండండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X