త్వరలో శాంసంగ్ హీరో మ్యూజిక్..

Posted By: Super

త్వరలో శాంసంగ్ హీరో మ్యూజిక్..

 

మ్యూజిక్ అభిమానులకు శుభవార్త. శాంసంగ్ మ్యూజిక్ అభిమానుల కొసం ప్రత్యేకంగా 'శాంసంగ్ హీరో మ్యూజిక్ ఈ123బి' అనే డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్‌ని విడుదల చేయనుంది. 'శాంసంగ్ హీరో మ్యూజిక్ ఈ123బి' మొబైల్ స్క్రీన్ సైజు 1.8 ఇంచ్‌ని కలిగి ఉండి బార్ మోడల్ మొబైల్. ఇండియాలో ప్రస్తుతం డ్యూయల్ సిమ్ మొబైల్ ఫోన్స్‌కి మంచి గిరాకీ ఉండడంతో శాంసంగ్ తక్కువ ధరలో ఈ డ్యూయల్ సిమ్ మొబైల్‌ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

'శాంసంగ్ హీరో మ్యూజిక్ ఈ123బి' మొబైల్ పవర్ పుల్ బ్యాటరీ బ్యాక్‌అప్‌‌ని అందించేందుకు గాను, పవర్ పుల్ బ్యాటరీని నిక్షిప్తం చేయడం జరిగింది. టాక్ టైమ్ 11 గంటలు రాగా, స్టాండ్ బై టైమ్ 580 గంటలు. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 4జిబి వరకు విస్తరించుకొవచ్చు.

ఈ మొబైల్‌లో ఎంటర్టెన్మెంట్ కొసం ప్రత్యేకంగా ఎఫ్‌ఎమ్ రేడియోని కూడా అమర్చడం జరిగింది. ఇందులో ఉన్న ఆడియో, వీడియో ప్లేయర్స్ మార్కెట్లో లభించే అన్ని రకాల ఫార్మెట్లను సపొర్ట్ చేస్తాయి. ఎవరైతే మ్యూజిక్ అంటే ప్రాణంగా భావిస్తారో అటువంటి వారిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా తయారు చేయడం జరిగింది. ఇందులో ఉన్న లౌడ్ స్పీకర్ ఫెసిలిటీ సహాయంతో మ్యూజక్‌ని క్లారిటీ సౌండ్‌తో వినేటటువంటి వెసులుబాటు కల్పించడం జరిగింది.

ఇండియన్ మొబైల్ మార్కెట్లో 'శాంసంగ్ హీరో మ్యూజిక్ ఈ123బి' మొబైల్‌ని ఎప్పుడు  విడుదల చేయనున్నామనే సంగతిని అధికారకంగా వెల్లిడంచ లేదు. ఇంటర్నెట్లో సంచరిస్తున్న రూమర్స్ ప్రకారం వచ్చే నెలలో మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. మొబైల్ ధరని కూడా ఇంకా వెల్లడించ లేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot