Home
Mobile

ఆ హిరో పై మరో హిరో ఫైర్.. తీర్పు చెప్పిన ఫ్యాన్స్?

By Super
 Samsung Hits Back with Galaxy S3 vs iPhone 5 Ad


పేటెంట్ హక్కుల విషయంలో ఆపిల్, సామ్‌సంగ్‌ల మధ్య ముసురుకున్న వివాదం రోజు రోజుకు ముదురుతోంది. ఈ వ్యవహారానికి సంబంధించి అమెరికా న్యాయస్థానం ఇటీవల ఆపిల్‌కు అనుకూలంగా తీర్పును వెలువరించింది. ఇదే క్రమంలో ఆపిల్, న్యూ జనరేషన్ ఐఫోన్5ను ఆవిష్కరించింది. ప్రత్యర్థిని ఎదుర్కొనే క్రమంలో అవకాశాలు కోసం ఎదురుచూస్తున్న సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్3 ఫీచర్లను ఐఫోన్5తో విశ్లేషిస్తూ ఓ వార్తా ప్రకటనను విడుదల చేసింది. కరపత్రాన్ని పోలి ఉన్న ఈ ప్రకటనలో రెండు గ్యాడ్జెట్‌లకు సంబంధించి స్పెసిఫికేషన్‌లతో పాటు “It doesn’t take a genius”, “The next big thing is already here, Galaxy S3” అనే రెండు స్టెట్‌మెంట్‌లను సామ్‌సంగ్ ప్రచురించింది. ఈ ప్రకటన ఆధారంగా చేసుకుని నిర్వహించిన ‘ఐబీఎన్ లైవ్ పోల్’ కార్యక్రమంలో 56శాతం మంది గెలాక్సీఎస్3కు అనుకూలంగా ఓటు వేశారు. అయితే, పలువురు నిపుణులు మాత్రం న్యాయస్థానం తీర్పుతో సామ్‌సంగ్‌‍కు జరగాల్సిన నష్టం జరిగిపోయిందనే వాదనను తెరపైకి తెస్తున్నారు.

గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం(త్వరలో ఆండ్రాయిడ్ జెల్లీబీన్ కు అప్ డేట్ అయ్యే అవకాశం) , క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబ్బిల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 16జీబి మెమరీ వేరియంట్ ధర రూ.38400, 32జీబి మెమెరీ వేరియంట్ ధర రూ.41,500.

ఐఫోన్ 5:

4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్

నెట్‍‌వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్

(8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం). నానో సిమ్‌కార్డ్ సపోర్ట్, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, సిరీ లాంగ్వేజ్ కమాండ్స్, ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్, ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం, టీవీ అవుట్, ఐమ్యాప్స్, ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్, ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, ఇమేజ్ ఎడిటర్, వాయిస్ మెమో.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X