బిగ్‌బాస్ కాదు.. శాంసంగ్ హుగో బాస్

Posted By: Super

బిగ్‌బాస్  కాదు.. శాంసంగ్ హుగో బాస్

శాంసంగ్ స్మార్ట్ ఫోన్స్ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్న సంస్ద. సాధారణంగా ఏదైనా పండుగలు వస్తున్నాయంటే మార్కెట్లోకి కొత్త కొత్త మొబైల్స్‌ని విడుదల చేయాలని మొబైల్ కంపెనీలు తాపత్రయపడుతుంటాయి. కానీ శాంసంగ్ మాత్రం దానికి భిన్నంగా గతంలో విడుదల చేసిన 'శాంసంగ్ ఎఫ్ 480' స్మార్ట్ ఫోన్‌ని లేటేస్ట్ అప్లికేషన్స్‌తో మరలా తిరిగి ఈ క్రిస్టమస్‌కి 'శాంసంగ్ హుగో బాస్' అనే పేరుతో విడుదల చేస్తుంది.

త్వరలో మార్కెట్లోకి రానున్న 'శాంసంగ్ హుగో బాస్' మొబైల్‌కు ఉన్న బ్లాక్ కవర్ తన అందాన్ని మరింత ఇమడింప జేస్తుంది. ఇక 'శాంసంగ్ హుగో బాస్' ప్రత్యేకతలు విషయానికి వస్తే 3.5 ఇంచ్ డిస్ ప్లే దీని సొంతం. మొబైల్ ఫెర్పామెన్స్ ఫాస్టుగా ఉండేందుకు గాను ఇందులో 800 MHz సింగల్ కొర్ ప్రాసెసర్‌ని నిక్షిప్తం చేయడం జరిగింది. 'శాంసంగ్ హుగో బాస్' స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 2.3.3 జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.

మొబైల్ వెనుక భాగాన ఉన్న 5 మెగా ఫిక్సల్ కెమెరాతో అందమైన ఫోటోలను తీయవచ్చు. ఆటోఫోకస్ కెమెరా ప్రత్యేకం. కమ్యూనికేషన్, కనెక్టివిటీ ఫీచర్స్ అయిన బ్లూటూత్, వై - పై లను కూడా సపోర్ట్ చేస్తుంది. మొబైల్‌తో పాటు ఇంటర్నల్‌గా కొంత మెమరీ లభిస్తుండగా, ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా మెమరీని 32జిబి వరకు విస్తరించుకొవచ్చు. ఇక ఇండియన్ మొబైల్ మార్కెట్లో  'శాంసంగ్ హుగో బాస్' మొబైల్ ధర సుమారుగా రూ 25,000 వరకు ఉండవచ్చునని మొబైల్ నిపుణుల అంచనా..

'శాంసంగ్ హుగో బాస్' మొబైల్‌ ప్రత్యేకతలు:

* 800 MHz processor

* Android ™ 2.3.3 Gingerbread

* internal memory 32 GB with a microSD card

* 3.5-inch touchscreen Display

* a 5 megapixel camera

* 3G (HSDPA 7.2 Mbps), WiFi All Share DLNA, Bluetooth, USB and A-GPS

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot