మోస్ట్ వాంటెడ్ ఫోన్ ‘శ్యామ్‌సంగ్ I6172’!!

Posted By: Staff

మోస్ట్ వాంటెడ్ ఫోన్ ‘శ్యామ్‌సంగ్ I6172’!!

 

మొబైల్ ఫోన్ మార్కెట్‌ను దిగ్గజ బ్రాండ్ శ్యామ్‌సంగ్ శాసిస్తున్న రోజులివి. మొబైల్ వ్యవస్థలో ఎన్ని సంస్కరణలు చోటుచేసుకుంటున్నప్పటికి  చెక్కుచెదరని ఆత్మ విశ్వాసంతో శ్యామ్‌సంగ్ దూసుకుపోతుంది. తాజాగా ఈ మోస్ట్ వాంటెడ్ బ్రాండ్ విడుదల చేసిన

‘I6172’ టచ్ ఆధారిత  ఫ్యూచర్ ఫోన్ ‘రివ్యూ’ విశేషాలను క్లుప్తంగా పరిశీలిద్దాం:

ఫీచర్లు:

ఈ ఫోన్ డిస్‌ప్లే వైశాల్యం 3.2 అంగుళాలు, టీఎఫ్టీ (TFT) సామర్ధ్యం గల టచ్ స్ర్కీన్ సౌలభ్యత,  ప్రాక్సిమిటీ (Proximity) సెన్సార్ వ్యవస్ధ, ఇంటర్నల్ మెమరీ 20 ఎంబీ, ఎక్స్‌ప్యాండబుల్ విధానం ద్వారా 16జీబికి పెంచుకోవచ్చు. 3.2 మెగా పిక్సల్ కెమెరా, వీడియో రికార్డర్, ఇంటిగ్రేటెడ్ ఎఫ్ఎమ్ రేడియో, మొబైల్ టీవీ ఆప్షన్, ఇంటర్నెట్ బ్రౌజర్, మల్టిపుల్ సిమ్ స్లాట్స్, బ్లూటూత్ 3.0, వై-ఫై. యూఎస్బీ 2.0 పోర్ట్స్, మైక్రో యూఎస్బీ  కనెక్టర్, యూఎస్బీ ఛార్జింగ్, 1200mAh బ్యాటరీ, స్టాండ్ బై టైమ్ 1090 గంటలు, టాక్ టైమ్ 13.33 గంటలు, బరువు 100గ్రాములు, చుట్టు కొలతలు 109.5 mm x 56 mm x 12.2 mm

‘శ్యామ్ సంగ్ I6172’ క్లాసీ లుక్‌లో డిజైన్ కాబడి హుందాతనాన్ని సంతరించుకుని ఉంటుంది. ఆకర్షణీయమైన నలుపు రంగులో ఈ ఫోన్ రూపుదిద్దుకుంది. ఈ స్మార్ట్ మొబైల్ బరవు కేవలం 100 గ్రాములు. పొందుపరిచిన  మొబైల్ టీవీ ఆప్షన్ ద్వారా కావల్సిన టీవీ ఛానళ్లను స్ర్టీమ్ చేసుకోవచ్చు. యూఎస్బీ కేబుల్ ఆధారితంగా ఈ డివైజ్‌ను ఛార్జ్ చేసుకోవచ్చు. మొబైల్‌లో ముందుగానే లోడ్ చేసిన వెబ్ బ్రౌజర్ అప్లికేషన్ సులువైన నెట్ బ్రౌజింగ్‌కు దోహదపడుతుంది. భారీ  అంచనాల మధ్య ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘శ్యామ్ సంగ్   I6172’ ధర మరియు ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot