మోటరోలాకు పోటీగా సామ్‌సంగ్ వచ్చేస్తోంది!
సాధారణ మొబైల్ ఫోన్‌లతో విసిగివేసారుతున్న సగటు వినియోగదారుడు స్మార్ట్‌ఫోన్‌ల వైపు మొగ్గుచూపుతున్నాడు. ఈ క్రమంలో ఇండియా వంటి ప్రధాన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లలో బడ్జెట్ ప్రెండ్లీ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లకు మంచి ఆదరణ నెలకుంది. స్మార్ట్‌ఫోన్‌ల ఎంపికలో సగటు భారతీయుడి ఆలోచనలను ముందుగానే అంచానా వేసిన అంతర్జాతీయ బ్రాండ్ మోటరోలా అందుకు అనుగుణంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో విడుదల చేస్తూ సంచలనాలు నమోదుచేస్తోంది.. బ్రాండ్ ఇమేజ్‌కు క్వాలిటీ తోడవటంతో మోటరోలా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లైన ‘మోటో జీ', ‘మోటో ఇ'లు అమ్మకాల పరంగా దుమ్మురేపుతున్నాయి. ఈ క్రమంలో మోటరోలా ఆధిపత్యానికి బ్రేకులు వేసేందుకు సామ్‌సంగ్ పావులు కదుపుతున్నట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల నివేదికల ఆధారంగా సేకరించిన వివరాల మేరకు మోటరోలా ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా సామ్‌సంగ్ రూ.7,000 ధర పరిధిలో డ్యూయల్ కోర్ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ ఫోన్ మోడల్‌ను ‘ఎస్ఎమ్ - జీ350ఇ' ( SM- G350E)గా పలు వెబ్‌సైట్‌లు పేర్కొన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.
ఇండియన్ మార్కెట్లో ఇటీవల విడదలై అమ్మకాల పరంగా సంచలనాలు నమోదు చేస్తున్న మోటరోటా మోటో ఇ కీలక స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే..........
మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








