సామ్‌సంగ్ నుంచి 8జీబి మొబైల్ ర్యామ్

డ్యుయల్ కెమెరా సపోర్ట్, 4కే అల్ట్రా హైడెఫినిషన్ వీడియో రికార్డింగ్, వీఆర్ సపోర్ట్ వంటి ఆధునిక ఫీచర్లతో వచ్చే అల్ట్రా హైడెఫినిషన్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ 8జీబి మొబైల్ ర్యామ్‌ను విడుదల చేసింది. 10 నానోమీటర్ ప్రాసెస్ ఆధారంగా ఈ 8జీబి మైబైల్ DRAM ప్యాకేజీని సామ్‌సంగ్ అభివృద్థి చేసింది.

Read More : వొడాఫోన్ 1జీబి 3జీ/4జీ డేటా రూ.55కే!

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

భవిష్యత్‌లో విడుదలయ్యే ఫ్లాగ్‌షిప్ మొబైల్స్ కోసం

తమ శక్తివంతమైన 8జీబి మొబైల్ ర్యామ్ ఆవిర్భావంతో, భవిష్యత్‌లో విడుదలయ్యే ఫ్లాగ్‌షిప్ మొబైల్ డివైస్‌లు ఆధునిక స్మార్ట్ కమ్యూనికేషన్ అవసరాలను సమర్థవంతంగా తీర్చగలగుతాయని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (మెమరీ సేల్స్ ఇంకా మార్కెటింగ్) జో సన్ చోయ్ తెలిపారు.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రెండితలు వేగంగా..

గరిష్టంగా 4,266ఎంబీపీఎస్ వేగాన్ని ఆపరేట్ చేయగలిగే ఈ సరికొత్త ర్యామ్ పీసీలలో వాడే స్టాండర్డ్ DDR4 DRAMలతో పాటు రెండితలు వేగంగా స్సందించగలదట.

10 నానో మీటర్ ప్రాసెస్ టెక్నాలజీ

10 నానో మీటర్ ప్రాసెస్ టెక్నాలజీ, సామ్‌సంగ్ ప్రొప్రైటరీ ‘లో డిజైన్ పవర్ సర్క్యూట్ డిజైన్'వంటి అంశాలు ఈ ర్యామ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిలబెడతాయి.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

15x15x1.0మిల్లీ మీటర్ల చుట్టుకొలత

కేవలం 15x15x1.0మిల్లీ మీటర్ల చుట్టుకొలతను కలిగి ఉండే సామ్‌సంగ్ 8GB మొబైల్ ర్యామ్ స్లిమ్ లుక్‌తో అన్ని రకాల అల్ట్రా స్లిమ్ స్మార్ట్‌ఫోన్‌లను సంతృప్తి పరుస్తుంది.

6జీబి ర్యామ్ సామర్థ్యంతో 'గెలాక్సీ సీ9'

సామ్‌సంగ్ అప్‌కమింగ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటైన 'గెలాక్సీ సీ9'(Galaxy C9) 6జీబి ర్యామ్ సామర్థ్యంతో మరికొద్ది గంటల్లో అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

2017లో సామ్‌సంగ్ 8జీబి ర్యామ్‌ ఫోన్..?

8జీబి ర్యామ్‌తో కూడిన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ వచ్చే ఏడాది అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశముంది.

లేటెస్ట్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Samsung Introduces 8GB LPDDR4 RAM for Mobile Devices. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting