నవంబర్ 9న శాంసంగ్ నుంచి దిమ్మతిరిగే మొబైల్
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మొబైల్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. తన తరువాతి తరం ఫోన్ ను నవంబర్ 9 న లాంచ్ చేయబోతోంది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మొబైల్ మార్కెట్లో మరో సంచలనం సృష్టించేందుకు రెడీ అయింది. తన తరువాతి తరం ఫోన్ ను నవంబర్ 9 న లాంచ్ చేయబోతోంది. శాంమొబైల్ తెలిపిన వివరాల ప్రకారం శాంసంగ్ చైనా కంపెనీ ఇప్పటికే మీడియాకు ఈ ఫోన్ లాంచ్ కు సంబంధించి ఆహ్వానాలను కూడా పంపింది. SM-W2019పేరుతో కంపెనీ ఈ ఆహ్వనాలను పంపినట్లుగా తెలుస్తోంది. కాగా కంపెనీ నుంచి అందిన అనధికా సమాచారం ప్రకారం రానున్న మొబైల్ పేరు Wuxiగా తెలుస్తోంది. అయితే ఈ మొబైల్ కేవలం చైనాలో మాత్రమే లాంచ్ కానుంది. గ్లోబల్ వ్యాప్తంగా చైనా ఈ ఫోన్ ను లాంచ్ చేయడం లేదని ప్రస్తుతానికి చైనాలో మాత్రమే ఫోన్ విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి.

ట్విట్టర్లో యూజర్ bang_gogo ట్వీట్ చేశాడు
ఈ విషయాన్ని ట్విట్టర్లో యూజర్ bang_gogo ట్వీట్ చేశాడు. శాంసంగ్ కంపెనీ ీ సీరిస్ తో సరికొత్త ఫోన్ ని తీసుకురానుందని ఎరుపు , నీలం రంగుల్లో ఈ ఫోన్ ఉండనుందని ఆ ట్వీట్ లో తెలిపారు. మరన్ని అప్ డేట్లు తెలియాలంటే నవంబర్ 9 వరకు వేచి చూడాలని ఆ ట్వీట్లో తెలిపారు.

క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో....
దీంతో పాటు Chinese certification website అయిన టీనా కూడా ఈ ఫోన్ మీద కొన్ని లీకులను బయటకు వదిలింది. SM-W2019తో రానున్న ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో రానుంది.

ఆండ్రాయిడ్ 9పై మీద ఈ ఫోన్ రన్ కానుంది...
4.2 పుల్ హెచ్ డి రిజల్యూషన్ తో పాటు అమోల్డ్ డిస్ ప్లే , డ్యూయల్ రేర్ కెమెరా తో రానుంది. అలాగే ఆండ్రాయిడ్ 9పై మీద ఈ ఫోన్ రన్ కానుంది. ఇక బ్యాటరీ విషయానికొస్తే 3,000mAh battery, 3.5mm జాక్ తో అందుబాటులోకి రానుంది.

12 మెగా ఫిక్సల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో మొబైల్ రానుంది...
కంపెన నుంచి ఈ తరహాలో రానున్న ఫస్ట్ మొబైల్ కూడా ఇదేనని తెలుస్తోంది. లీకయిన వివరాల ప్రకారం 12 మెగా ఫిక్సల్ ప్రైమరీ సెన్సార్ కెమెరాతో మొబైల్ రానుంది. డ్యూయల్ aperture modes అదనపు బలాన్ని ఇవ్వనుంది.

శాంసంగ్ నుంచి రానున్న ఫస్ట్ ఫోల్డబుల్ కూడా ఇదే..
కాగా శాంసంగ్ నుంచి రానున్న ఫస్ట్ ఫోల్డబుల్ కూడా ఇదే.. అంతే కాకుండా ప్రపంచంలో మొట్టమొదటి ఫోల్డబుల్ ఫోన్ కూడా ఇదే కానుంది. కాగా యుఎస్ బేస్ డ్ కంపెనీ Royole FlexPai శాంసంగ్ కంపెనీని బీట్ చేసింది. ఈ కంపెనీ నుంచి FlexPai పేరుతో తొలిసారిగా ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.

7.8 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది...
అయితే ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్ దాదాపు 7.8 ఇంచ్ డిస్ ప్లేని కలిగి ఉంది. దీన్ని ట్యాబ్లెట్ గా పరిగణలోకి తీసుకుంటారు కాబట్టి ప్రపంచపు తొలి ఫోల్డబుల్ ఫోన్ శాంసంగ్ దే కానుంది.

శాంసంగ్ నుంచి 4 ఇంచ్ డిస్ ప్లే ఫోన్ అమోల్డ్ డిస్ ప్లే తో రానుంది...
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ నుంచి 4 ఇంచ్ డిస్ ప్లే ఫోన్ అమోల్డ్ డిస్ ప్లే తో రానుంది. ఇంకా ఆసక్తికర అంశం ఏంటంటే ఈ డిస్ ప్లేని కూడా Royole FlexPai కంపెనీనే తయారు చేసింది. కాగా ఈ ఫోన్ ధర సుమారుగా 1300 డాలర్లు ఉండే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








