శ్యామ్‌సంగ్, గూగుల్ భాగస్వామ్యంలో 'నెక్సస్ ప్రైమ్'

Posted By: Staff

శ్యామ్‌సంగ్, గూగుల్ భాగస్వామ్యంలో 'నెక్సస్ ప్రైమ్'

యూనివర్సల్ మొబైల్ గెయింట్ శ్యామ్‌సంగ్ త్వరలో సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్‌తో బిజినెస్‌ని కలుపుకొనుంది. ఈ రెండు సంస్దలు కలసి త్వరలోనే సూపర్ స్మార్ట్ పోన్‌ని మార్కెట్లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. శ్యామ్‌సంగ్ నెక్సస్ సిరిస్‌లో విడుదల చేయనున్న ఈ సూపర్ స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడెడ్ టెక్నాలజీతో ఎవరి ఊహాలకు అందనంత అందంగా మాత్రమే కాకుండా ఇందులో ఫీచర్స్ కూడా అలానే రూపోందిస్తామని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మొబైల్ నిపుణులు అందరూ కూడా ఈ మొబైల్ గురించి తెలుసుకొవడానికి చాలా ఆసక్తిని చూపుతున్నారు. ఇందుకు గల కారణం శ్యామ్‌సంగ్, గూగుల్ రెండు సంయుక్తంగా రూపోందించిన ఆపరేటింగ్ సిస్టమ్ 'ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండివిచ్‌'తో ఈ శ్యామ్‌సంగ్ నెక్సస్ ఫోన్ రన్ అవుతుంది కాబట్టి.

శ్యామ్‌సంగ్ ఈ మొబైల్‌ని ప్రత్యేకంగా గూగుల్ కోసం రూపొందించడం జరుగుతుంది. ఇటీవలే శ్యామ్‌సంగ్ కంపెనీ లీగల్‌గా లాయర్ నోటీస్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ లీగల్ నోటీస్‌లో శ్యామ్‌సంగ్ నెక్సస్‌కు సంబందించిన ఫీచర్స్ కానీ, ఇమేజిలు గానీ బయట ఎవరూ కూడా వెల్లడించకూడదని స్పష్టం చేసింది. దీనిని బట్టి చూస్తుంటేనే తెలుస్తుంది శ్యామ్‌సంగ్ నెక్సస్ విషయంలో ఎంత సీరియస్‌గా ఉందో. శ్యామ్‌సంగ్ నెక్సస్ లేదా గూగుల్ ఫోన్స్ ఎటువంటి త్వరలోనే కస్టమర్స్ చేతులలోనికి రానున్నాయి.

ఇంతకీ శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న మొబైల్ పేరు ఏంటని అనుకుంటున్నారా 'శ్యామ్‌సంగ్ నెక్సస్ ప్రైమ్'. మాకు తెలిసిన సమాచారం మేరకు శ్యామ్‌సంగ్ నెక్సస్ ప్రైమ్ స్క్రీన్ సైజు సుమారుగా 4 నుండు 5.2 ఇంచ్‌గా ఉండవచ్చునని భావిస్తున్నారు. దీనితో పాటు AMOLED HD స్క్రీన్ డిస్ ప్లే దీని సొంతం. మల్టీ టాస్కింగ్ పనులను వేగవంతంగా చేయడానికి 1.5 GHz Texas ప్రాససెర్‌ని ఇందులో నిక్షిప్తం చేయడం జరిగింది. వీటితో పాటు ఇందులో ముఖాన్ని గుర్తించే సాప్ట్ వేర్‌ని పొందుపరచడం జరిగింది.

అదనపు ఆకర్షణీయమైన ఫీచర్స్:

*వైర్‌లెస్ ఛార్జింగ్
*గూగుల్ మోనటిరింగ్ ప్రోటోకాల్స్
* గూగుల్ అప్లికేషన్స్
*శ్యామ్‌సంగ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్
* ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టమ్ v4.0

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot