ఈ రోజు ఇండియా మార్కెట్లోకి లాంచ్ కానున్న శాంసంగ్ సంచలన ఫోన్లు
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మరో మూడు కొత్త ఫోన్లను ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది.కాగా Galaxy S10, Galaxy S10 Plus,S10e పేర్లతో ఫోన్లను విడుదల చేయబోతుంది.
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ మరో మూడు కొత్త ఫోన్లను ఈ రోజు ఇండియా మార్కెట్లో లాంచ్ చేయనుంది.కాగా Galaxy S10, Galaxy S10 Plus,S10e పేర్లతో ఫోన్లను విడుదల చేయబోతుంది .ఈ ఫోన్ల యొక్క లాంచ్ ఈవెంట్ ఈ రోజు మద్యహ్నం 12:30pm కి మొదలు కానుంది.ఈ ఫోన్ల యొక్క ప్రీ-ఆర్డర్లు ఈ రోజు నుంచి మొదలు కానున్నాయి. శాంసంగ్ యొక్క అధికార వెబ్ సైట్ తో పాటు అమెజాన్, పేటీఎమ్,ఫ్లిప్ కార్ట్, టాటా క్లిక్, మరియు రిటైల్ అవుట్లెట్లతో సహా పలు ఛానళ్లు ద్వారా ఈ ఫోన్లను బుక్ చేసుకోవచ్చు.ఈ శీర్షికలో భాగంగా శాంసంగ్ కొత్తగా లాంచ్ చేసిన Galaxy S10, Galaxy S10 Plus,S10e ధర మరియు ఫీచర్లను మీకు తెలుపుతున్నాము.ఓ లుక్కేయండి.

Samsung Galaxy S10 ధర
8జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ - రూ. 66,900
8జీబీ ర్యామ్ /512జీబీ స్టోరేజ్ - రూ. 84,900
ఫీచర్లు
6.1 అంగుళాల డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128,512 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3400 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్

Samsung Galaxy S10+ ధర
8జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ - రూ. 73,900
12జీబీ ర్యామ్/512జీబీ స్టోరేజ్- రూ. 91,900
12జీబీ ర్యామ్/1టీబీ స్టోరేజ్- రూ. 1,17,900
ఫీచర్లు
6.3 అంగుళాల డిస్‌ప్లే, 3040 x 1440 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 8జీబీ,12 జీబీ ర్యామ్, 128జీబీ,512 జీబీ,1టీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16+12 మెగాపిక్సల్ ట్రిపుల్ బ్యాక్ కెమెరాలు, 10,8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాలు , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 4100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.

Samsung Galaxy S10e ధర
6జీబీ ర్యామ్ /128జీబీ స్టోరేజ్ - రూ. 55,900
ఫీచర్లు
5.8 అంగుళాల డిస్‌ప్లే, 2280 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 855 ప్రాసెసర్, 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్,ఆండ్రాయిడ్ 9.0 పై, డ్యుయల్ సిమ్, 12+16 మెగాపిక్సల్ డ్యూయల్ బ్యాక్ కెమెరాలు, 10 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా , డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్‌ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్ సి, 3100 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.


Click it and Unblock the Notifications








