భారత్‌లోకి సామ్‌సంగ్ టైజెన్ ఫోన్‌

Posted By:

‘టైజెన్' ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను సామ్‌సంగ్ భారత్ మార్కెట్లోకి తీసుకురాబోతుంది. సామ్‌సంగ్ సొంత ఆపరేటింగ్ సిస్టంతో రాబోతున్న ఈ ఫోన్ పేరు సామ్‌సంగ్ జెడ్1 (మోడల్ నెంబర్: SM-Z130H). కొరియన్ ఎకనమిక డైలీ వెల్లడించిన వివరాల మేరకు ఈ ఫోన్ 2015, జనవరి 18న ఇండియాలో రిలీజ్ అవుతుంది. ధర 90 డాలర్లు (మన కరెన్సీలో రూ.5,691).

భారత్‌లోకి సామ్‌సంగ్ టైజెన్ ఫోన్‌

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

టైజెన్ ఓఎస్ పై స్పందించే సామ్‌సంగ్ జెడ్1 ఫోన్ ప్రత్యేకతలు:

ఈ ఎంట్రీ లెవల్ ఫోన్ 480 x 800 పిక్సల్ క్వాలిటీతో కూడిన 4 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1.2గిగాహెర్ట్జ్ డ్యుయల్ కోర్ స్ప్రెడ్‌ట్రమ్ ప్రాసెసర్‌ను డివైస్‌లో పొందుపరిచారు. 512 ఎంబి ర్యామ్, 3.2 మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, వై-ఫై, డ్యుయల్ సిమ్), ఇతర స్పెసిఫికేషన్‌లు వెల్లడికావల్సి ఉంది.

ఈ ఫోన్‌ను ఇండియాతో పాటు చైనా ఇంకా కొరియా మార్కెట్లలో సామ్‌సంగ్ విడుదల చేయనుంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung to Launch its Tizen based Smartphones Officially in India Next Year. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot