సామ్‌సంగ్ నుంచి రెండు తక్కువ ధర స్మార్ట్‌ఫోన్‌లు: ఈ నెలలోనే!

|

దక్షిణ కొరియాకు చెంది ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ బ్రాండ్ సామ్‌సంగ్ ఈ సెప్టంబర్ లో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ ఫోన్‌ల ధర రూ.5,000 నుంచి రూ.10,000 మధ్య ఉంటుంది.

 

సామ్‌సంగ్ నుంచి విడుదల కాబోతున్న ఈ ఫోన్‌లు తెలుగు సహా దేశంలోని ఇతర ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేస్తాయి. సామ్ సంగ్ ప్రస్తుతానికి రూ.5,000 నుంచి రూ.39,000 ధరల్లో 20 స్మార్ట్ ఫోన్ మోడళ్లను ఆఫర్ చేస్తోంది. వీటిలో 12 స్మార్ట్ ఫోన్ లు రూ.5,000 నుంచి రూ.15,000 ధరల మధ్య లభ్యమవుతున్నాయి. వీటి పేర్లు గెలాక్సీ స్టా్, గెలాక్సీ పాకెట్ నియో, గెలాక్సీ మ్యూజిక్ డ్యుయోస్, గెలాక్సీ ఏస్, గెలాక్సీ వై, గెలాక్సీ యంగ్, గెలాక్సీ ఫేమ్, గెలాక్సీ ఏస్ డ్యుయోస్, గెలాక్సీ వై డ్యుయోస్,గెలాక్సీ ఎస్ డ్యుయోస్, గెలాక్సీ ఎస్ ఆడ్వాన్స్, గెలాక్సీ కోర్. సామ్ సంగ్ నుంచి ఇటీవల విడుదలైన గెలాక్సీ నోట్ 3 స్పెసిఫికేషన్ లను క్రింద చూడొచ్చు..

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మంగళవారం కొత్తఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సామ్‌‍సంగ్ ఇండియా గెలాక్సీ నోట్ 3 ఫాబ్లెట్ ఇంకా గెలాక్సీ గేర్ స్మార్ట్‌వాచ్‌లను అధికారికంగా ఆవిష్కరించింది. రిటైలింగ్ మార్కెట్లో గెలాక్సీ నోట్3 ధర రూ.49,900. గెలాక్సీగేర్ స్మార్ట్‌వాచ్ ధర రూ.22,990. ఈ రెండు డివైజులు సెప్టంబర్ 25 నుంచి రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతాయి. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 3 కీలక స్పెసిఫికేషన్‌లు: ఫోన్ పరిమాణం 151.2 x 79.2 x 8.3మిల్లీమీటర్లు, బరువు 168 గ్రాములు, 8 కోర్ ఎక్సినోస్ 5 ఓక్టా ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 5.7 అంగుళాల పూర్తి హైడెఫినిషన్ రిసల్యూలసన్ సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫాబ్లెట్ మెమరీని 64జీబికి విస్తరించుకునే సౌలభ్యత, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా (స్మార్ట్ స్టెబిలైజేషన్, హై‌ సీఆర్ఐ ఎల్ఈడి ఫ్లాష్), 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, 3,200 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం. కలర్ వేరియంట్స్: బ్లాక్, పింక్, వైట్.

 

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X