రూ.7699 ధరకే 6 సంవత్సరాల అప్‌డేట్స్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ స్మార్ట్‌ఫోన్..!
శాంసంగ్ భారత్ మార్కెట్‌లో బడ్జెట్ ధరలో మూడు స్మార్ట్‌ఫోన్‌లను తీసుకొచ్చింది. శాంసంగ్ గెలాక్సీ A07 4G, గెలాక్సీ M07 4G, గెలాక్సీ F07 4G పేర్లతో విడుదల అయ్యాయి. ఈ మూడు స్మార్ట్‌ఫోన్ సుమారుగా ఒకే తరహా స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. రూ.9 వేల కంటే తక్కువ ధరలో లేటెస్ట్ గా వచ్చిన ఫోన్‌లను కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఈ మోడల్స్ మంచి ఆప్షన్‌గా ఉండే అవకాశం ఉంది.
గెలాక్సీ A07, F07, M07 స్మార్ట్‌ఫోన్‌ల స్పెసిఫికేషన్లు :
ఈ మూడు స్మార్ట్‌ఫోన్‌లు 90Hz రీఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల LCD HD+ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. ఈ ఫోన్ 7.6mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ గ్లాస్ ఫైబర్ రెయిన్‌ఫోర్డ్స్ పాలిమర్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంది. ఈ ఫోన్‌లు IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉన్నాయి.

ఈ స్మార్ట్‌ఫోన్లు మీడియాటెక్ హీలియో G99 ప్రాసెసర్ ను కలిగి ఉన్నాయి. ఈ ప్రాసెసర్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా 2TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత One UI 7 పైన పనిచేస్తోంది.
6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ :
ఈ గెలాక్సీ A07 4G, M07 4G, F07 4G స్మార్ట్‌ఫోన్‌లు 6 సంవత్సరాల వరకు OS అప్‌డేట్స్, 6 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతాయని శాంసంగ్ తెలిపింది. ఎంట్రీ లెవల్ మోడల్స్‌లో 6 సంవత్సరాల వరకు అప్‌డేట్స్ పొందడం ఈ ఫోన్‌ల ప్రత్యేకత.

50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్‌లు వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉన్నాయి. ఆటోఫోకస్ సామర్థ్యంతో 50MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ సెన్సర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు. ఈ మూడు ఫోన్‌లు 25W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉన్నాయి.
ఈ ఫోన్‌లు Knox Vault సెక్యూరిటీ సిస్టమ్, థెఫ్ట్ ప్రొటెక్షన్, ఆటో బ్లాకర్ వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ను కలిగి ఉంది. 4G, బ్లూటూత్ 5.3, వైఫై 5, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ను కలిగి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ A07 4G, M07 4G, F07 4G ధరల వివరాలు :
గెలాక్సీ A07 4G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy A07 4G) ప్రారంభ ధర రూ.8999 గా ఉంది. ఈ ఫోన్ గ్రీన్, బ్లాక్, లైట్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
గెలాక్సీ F07 4G స్మార్ట్‌ఫోన్ (Samsung Galaxy F07 4G) ప్రారంభ ధర రూ.7699 గా ఉంది. ఈ ఫోన్ గ్రీన్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.
గెలాక్సీ M07 4G ఫోన్ (Samsung Galaxy M07 4G) ప్రారంభ ధర రూ.7699 ఈ ఫోన్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








