Home
Mobile

Samsung నుంచి రెండు స్మార్ట్‌ఫోన్లు విడుదల.. 6.5 అంగుళాల డిస్‌ప్లే, ట్రిపుల్‌ కెమెరా సహా ఎన్నో ఫీచర్లు..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్‌ మార్కెట్‌లోకి రెండు స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. శాంసంగ్‌ గెలాక్సీ A25 5G, గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్‌లు 6.5 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే మరియు వెనుకవైపు 50MP ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంటాయి. మరియు 5000mAh బ్యాటరీతో వస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ A25 5G, గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ ధర : ఈ రెండు ఫోన్ల ప్రారంభ ధర రూ.17999గా ఉంది. అయితే ర్యామ్‌, అంతర్గత స్టోరేజీ ఆధారంగా ధరలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అయితే ప్రారంభ ధర కింద శాంసంగ్‌ ఆకట్టుకొనే ఆఫర్‌ను ప్రకటించింది.

Samsung Galaxy A25 and A15 smartphones

SBI కార్డులతో కొనుగోలు చేయడం ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్‌ బ్లూ, బ్లూ బ్లాక్‌, పసుపు రంగుల్లో లభిస్తుంది. అదే A15 5G బ్లూ బ్లాక్‌, బ్లూ, లైట్‌ బ్లూ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A25 5G, గెలాక్సీ A15 5G స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు : ఈ రెండు స్మార్ట్‌ఫోన్లు ఆండ్రాయిడ్‌ 13 ఆధారిత One UI 5 పైన పనిచేస్తాయి. మరియు 5 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్లు, నాలుగు సంవత్సరాల పాటు OS అప్‌డేట్లు ఇస్తామని శాంసంగ్‌ తెలిపింది.

Samsung Galaxy A25 and A15 smartphones

గెలాక్సీ A25 5G స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 1080*2408 పిక్సల్‌ రిజల్యూషన్‌తో వస్తుంది. మరియు 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తుంది. మరియు 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. అదే A15 మోడల్‌ స్మార్ట్‌ఫోన్‌ 6.5 అంగుళాల పుల్‌ HD+ సూపర్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు 90Hz రీఫ్రెష్‌ రేట్‌, 800 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తో వస్తుంది.

గెలాక్సీ A25 5G ఆక్టా కోర్‌ Exynos 1280 SoC తో 8GB ర్యామ్‌, 256GB అంతర్గత స్టోరేజీతో జతచేయబడుతుంది. అదే A15 ‌హ్యండ్‌సెట్‌ అండర్‌ ది హుడ్‌ ఆక్టాకోర్‌ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.
ఈ రెండు హ్యాండ్‌సెట్లు వెనుకవైపు ట్రిపుల్‌ కెమెరాను కలిగి ఉంటాయి.

Samsung Galaxy A25 and A15 smartphones

A25 మోడల్‌ 50MP ప్రధాన కెమెరా OIS- ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ ఫీచర్‌తో వస్తుంది. మరియు 8MP అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 2MP మరో లెన్స్‌ను కలిగి ఉంటుంది. అదే A15 స్మార్ట్‌ఫోన్‌ 50MP ప్రైమరీ కెమెరా, 5MP కెమెరా, 2MP మూడో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్లు 13MP ఫ్రంట్‌ కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా గెలాక్సీ A25, A15 హ్యాండ్‌సెట్లు 5G, వైఫై, బ్లూటూత్‌, GPS, 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్, USB-C పోర్టు, డాల్బీ అట్మాస్‌ సౌండ్‌ టెక్నాలజీని కలిగి ఉంటుంది. యాక్సిలిరోమీటర్‌, గైరోస్కోప్‌, జియోమాగ్నటిక్‌, లైట్‌ సెన్సార్‌, వర్చువల్‌ ప్రాక్సిమిటీ సెన్సార్లను కలిగి ఉంటుంది.

శాంసంగ్ గెలాక్సీ A25, గెలాక్సీ A15 5G బ్యాటరీ : ఈ రెండు మోడల్‌లు ఫింగర్‌ ఫ్రింట్‌ సెన్సార్‌తో వస్తాయి. ఈ రెండు ఫోన్లు 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 21 గంటల ప్లేబ్లాక్‌ టైంను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Samsung launched Galaxy A25 and A15 smartphones in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X