అదరగొట్టే శ్యామ్‌సంగ్ టచ్ మొబైల్...

Posted By: Super

అదరగొట్టే శ్యామ్‌సంగ్ టచ్ మొబైల్...

శ్యామ్‌సంగ్ తయారు చేసే ప్రతి మొబైల్ లోను ఇతర మొబైల్ కంపెనీలకు కొంత కొత్తదనాన్ని పరిచయం చేస్తూ వాటికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇటీవల కాలంలో కొత్త ఫోన్లను విడుదల చేయడంలో బిజీగా ఉన్న శ్యామ్‌సంగ్ కంపెనీ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్స్ మీద తన దృష్టిని నిలిపింది. అంతేకాకుండా కస్టమర్స్ యొక్క ఆశలకు అనుగుణంగా మొబైల్స్‌‌ని తయారు చేయడంలో శ్యామ్‌సంగ్ దిట్ట. అందులో భాగంగా ఇటీవల మార్కెట్లోకి 3జీ మోడల్‌కి సంబంధించిన మొబైల్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకుంది. దానిపేరే శ్యామ్‌సంగ్ ఎస్ 3770. ఈ మొబైల్‌ని ప్రవేశపెట్టడం ద్వారా శ్యామ్‌సంగ్ మిడిల్ రేంజి మొబైల్ మార్కెట్ మీద పట్టు సాధిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న మోడల్ శ్యామ్‌సంగ్ ఎస్ 3770. ఇది టచ్ స్క్రీన్ మొబైల్. దీనితో పాటు పుల్ టిఎఫ్‌టి టచ్ స్క్రీన్ డిస్ ప్లేని కలిగి ఉండి స్క్రీన్ రిజల్యూషన్ 240 X 320 ఫిక్సల్‌గా ఉంటుంది. ఈ హ్యాండ్ సెట్ 2 మెగా ఫిక్సల్ కెమెరాతో పాటు ఇమేజి క్యాప్చర్ ఉండడం వల్ల చక్కని ఇమేజిలను తీయగలుగుతుంది. ఇక ఇందులో ఉన్న ఎఫ్‌ఎమ్ రేడియో ఆర్‌డిఎస్ యాక్టివేషన్ ఫీచర్‌ను కలిగి ఉంది. మొబైల్ తోపాటు కొంత ఇంటర్నల్‌గా మొమొరీ రాగా మొమొరీని విస్తరించుకునేందుకు గాను ఇందులో ఉన్న మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 16జిబి వరకు మొమొరీని విస్తరించుకునే అవకాశం ఉంది.

ఇక కమ్యూనికేషన్, కనెక్టివిటీ విషయానికి వస్తే బ్లూటూత్, వై-పై లాంటి వాటిని సపోర్ట్ చేస్తుంది. వీటితోపాటు పుష్ మెయిల్, IM, WAP లాంటి వాటిని కూడా సపోర్ట్ చేస్తుంది. సోషల్ నెట్ వర్కింగ్ వెబ్ సైట్స్ అయిన ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి వాటికోసం ప్రత్యేకంగా బటన్స్ రూపోందిచబడినవి. ఇందులో పవర్ మేనేజ్ మెంట్ కోసం ఉపయోగించబడిన బ్యాటరీ 1000 mAh బ్యాటరీ. దీనివల్ల యూజర్స్ కంటిన్యూగా మాట్లాడితే బ్యాటరీ 6 గంటలు పాటు వస్తుంది. అదే స్టాండ్ బై టైమ్ 350 గంటలుగా నిర్ణయించారు. ఎంటర్టెన్మెంట్ విషయానికి వస్తే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్నిరకాల ఆడియో, వీడియో ఫార్మెట్లను సపోర్ట్ చేస్తుంది. శ్యామ్‌సంగ్ ఎస్ 3770కి సంబంధించిన ధరను ఇంకా మార్కెట్లోకి వెల్లడించలేదు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot