లండన్ వెలుగు జిలుగుల మధ్య గెలాక్సీ ఎస్3 విడుదల!!

Posted By: Staff

లండన్ వెలుగు జిలుగుల మధ్య గెలాక్సీ ఎస్3 విడుదల!!

యూవత్ టెక్ ప్రపంచం ఉత్కంఠతో ఎదురుచూసిన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌ను గురువారం లండన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆవిష్కరించారు. ఈ హ్యాండ్‌సెట్ HSPA+ సౌలభ్యతతో ప్రపంచవ్యాప్తంగా మే29 నుంచి లభ్యం కానుంది. 4జీ వర్షన్ గెలాక్సీ ఎస్3 స్మార్ట్‌ఫోన్‌లను ప్రత్యేకించి యూఎస్, కొరియా, జపాన్ దేశాల్లో విడుదల చేయునున్నారు.

ఇక ఫోన్ ప్రధాన ఫీచర్లు...

4.8 అంగుళాల హైడెఫినిషన్ సూపర్ ఆమోల్డ్ డిస్ ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్),


8 మెగా పిక్సల్ రేర్ కెమెరా,


1.9 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా,


ఆండ్రాయిడ్ ఐస్ క్రీమ్ శాండ్ విచ్ ఆపరేటింగ్ సిస్టం,


16,32,64మెమరీ వేరియంట్ లలో ఈ హ్యాండ్ సెట్ లభ్యం కానుంది.


2100 mAh సామర్ధ్యం గల శక్తివంతమైన బ్యాటరీని ఫోన్ లో ఏర్పాటు చేశారు.

అత్యాధునిక స్పెసిఫికేషన్‌లతో విడుదలైన గెలాక్సీ ఎస్3, ఆపిల్ ఐఫోన్‌కు ప్రధాన పోటీదారు కానుంది. ఎస్3లో నిక్షిప్తం చేసిన ఎస్ వాయిస్ ఫీచర్ మీ మాటలు ఆధారితంగా స్పందిస్తుంది. మరో వ్వవస్థ ‘డైరెక్ట్ కాల్ ఫీచర్’తో మరింత సునాయాసంగా కాలింగ్ నిర్వహించుకోవచ్చు. గెలాక్సీ ఎస్3 మార్బుల్ వైట్, పెబ్బిల్ బ్లూ రంగుల్లో లభ్యం కానుంది. ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ ధరను ఇంకా ప్రకటించలేదు.


Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot