రికార్డులంటే మావే..ఖబడ్దార్?

Posted By: Super

రికార్డులంటే మావే..ఖబడ్దార్?

‘విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే కోటి గెలాక్సీ ఎస్3 యూనిట్‌లను విక్రయించి సామ్‌సంగ్ అరుదైన రికార్డును నెలకొల్పింది.’

ప్రముఖ బ్రాండ్ సామ్‌సంగ్ , గెలాక్సీ ఎస్3 (32జీబి వర్షన్ ) స్మార్ట్‌ఫోన్‌‍ను భారత్‌లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. సామ్‌సంగ్ ఇండియా ఆన్‌లైన్ స్టోర్ ఈ స్మార్ట్ హ్యాండ్‌సెట్ ధరను రూ. 41,500గా ప్రకటించింది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3, 16జీబి వేరియంట్(ధర రూ.43,180)తో మే31న దేశీయ విపణిలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుత మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ధర రూ.38400. సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 (32జీబి వర్షన్) పెబ్బిల్ బ్లూ ఇంకా మార్బుల్ వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానుంది. ప్రస్తుతానికి సామ్‌సంగ్ ఈ-స్టోర్ వద్ద స్టాక్ లేదు. త్వరోలనే వీటిని దిగుమతి చేసుకోనున్నారు. మరో వైపు గెలాక్సీ ఎస్ 3(64జీబి వేరియంట్)ను ఈ ఏడాది చివరినాటికి సామ్‌సంగ్ అందుబాటులోకి తేనుంది. విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే కోటి యూనిట్‌లను విక్రయించి సరికొత్తి రికార్డును సామ్‌సంగ్ నెలకొల్పింది.

గెలాక్సీ ఎస్-3లోని ప్రత్యేక ఫీచర్లు:

స్మార్ట్ స్టే: యజమాని ముఖాన్ని, మాటలను గుర్తించి తదనుగుణంగా పనిచేయడమే ‘స్మార్ట్ స్టే’ ఫీచర్ విశిష్టత . యూజర్ ఫోన్‌ను చూస్తున్నంత సేపు స్క్రీన్ ప్రకాశవంతంగా ఉంటుంది.

ఎస్ వాయిస్: మీకు నచ్చిన పాట పేరు చెబితే చాలు దాన్ని ప్లే చేస్తుంది. వాల్యూమ్‌ను పెంచమని, తగ్గించమని చెప్పొచ్చు. కెమేరా ఆన్ చేసి ఫొటోలు తీయమనవచ్చు. మెయిల్స్, మెసేజ్‌లు పంపమనొచ్చు.

ఆల్‌షేర్ ప్లే : ఆప్షన్‌తో ఎటువంటి ఫైల్‌ను అయినా మరో గెలాక్సీ ఎస్-3కి, ట్యాబ్లెట్‌కు, పీసీకి, టీవీకీ పంపవచ్చు. వాటి మధ్య దూరంతో పనిలేదు.

డెరైక్ట్ కాల్ : మెసేజ్ టైప్ చేస్తున్న సందర్భంలో అదే నంబరు గల వ్యక్తికి ఫోన్ చెయ్యాలనిపిస్తే, జస్ట్ ఫోన్‌ను చెవి దగ్గర పెట్టుకొంటే చాలు సంబంధిత నంబర్‌కు ఫోన్ డయల్ అవుతుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3 ఫీచర్లు:

4.8 అంగుళాల మల్టీ టచ్‌స్ర్కీన్ (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ వీ4.0 ఐస్‌క్రీమ్ శాండ్‌విచ్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌కోర్ 1.4గిగాహెడ్జ్ కార్టెక్స్ ఏ9 ప్రాసెసర్, మాలీ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, Exynos 4212 క్వాడ్ చిప్‌సెట్, 8 మెగా పిక్సల్ కెమెరా (రిసల్యూషన్ 3264×2448పిక్సల్స్), 1.9మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, జియో ట్యాగింగ్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ (16/32/64జీబి వేరియంట్స్), ఎక్సటర్నల్ మెమరీ 64జీబి వరకు, మైక్రోఎస్డీ ఇంకా మైక్రో ఎస్‌హెచ్‌డీసీ కార్డ్‌స్లాట్ సౌలభ్యత, జీపీఆర్ఎస్ (క్లాస్12), ఎడ్జ్ (క్లాస్ 12), వై-ఫై కనెక్టువిటీ, బ్లూటూత్ (వీ4.0), యూఎస్బీ కనెక్టువిటీ, జీపీఎస్ ఫెసిలిటీ, బ్రౌజర్ (హెచ్‌టిఎమ్ఎల్, ఆడోబ్ ఫ్లాష్), నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ, 4జీ), ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్, గేమ్స్, ఎఫ్ఎమ్ రేడియో, లియోన్ 2100ఎమ్ఏహెచ్ బ్యాటరీ, బరవు 133 గ్రాములు. పెబల్ బ్లూ, మార్బుల్ వైట్ రంగుల్లో లభించే గెలాక్సీ ఎస్-3 ఫోన్ ధర ధర రూ.38400.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot