3జీ మొబైల్స్‌పై దృష్టిని సారించిన శ్యామ్‌సంగ్

Posted By: Staff

3జీ మొబైల్స్‌పై దృష్టిని సారించిన శ్యామ్‌సంగ్

ఇండియా జనాభా జీవన విధానంలో మొబైల్ ఓ భాగమైపోయిన రోజులివి. సమాన్య మానవుడి నుండి ఖరీదైన వ్యక్తి వరకు వారివారి తాహాతను బట్టి మొబైల్ ఫోన్‌ని కొనుగోలు చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఇటీవల కాలంలో ఇండియాకి 3జీ టెక్నాలజీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరి దృష్టి 3జీ మొబైల్స్ వైపుకి మరిలిందంటే అతిశయోక్తి కాదు. యూజర్స్ యొక్క ఆసక్తులను దృష్టిలో పెట్టుకొని మొబైల్ తయారీదారులు ఎప్పటికప్పుడూ వారియొక్క పంధాని మారుస్తూ ఉంటారు. ప్రస్తుతం ఇండియాలో 3జీ టెక్నాలజీ, డ్యూయల్ సిమ్, టచ్ స్క్రీన్ ఫోన్స్ ఫీవర్ ఎక్కవగా ఉండడంతో ప్రముఖ మొబైల్ కంపెనీ శ్యామ్‌సంగ్ 3జీ మొబైల్స్‌ని రూపోందించే పనిలో పడింది.

అసలు 3జీ అంటే ఏమిటి. 3జీ అంటే మూడవ జనరేషన్ అని అర్దం. 3జీ టెక్నాలజీ రావడంతో ఇంటర్నెట్ ప్రపంచం యూజర్స్‌కు తేలిక అవ్వడమే కాకుండా వీనులవిందైన పాటలు, వీడియోలు, ఆడియోలను చక్కగా ఎంజాయ్ చేయడం జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే ఈ 3జీ టెక్నాలజీ సహాయంతో అవతలి వైపున మాట్లాడే వ్యక్తిని కూడా చూడొచ్చు. దీనినే ముద్దుగా మనం వీడియో కాలింగ్ అని అంటున్నాం. ఇటీవల కాలంలో శ్యామ్‌సంగ్ కంపెనీ హై ఎండ్ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేస్తూ మార్కెట్లో తన హావాని కొనసాగిస్తుంది.

అందులో భాగంగానే శ్యామ్‌సంగ్ ఈ 3జీ టెక్నాలజీ మొబైల్ ఫోన్స్‌ని మార్కెట్లోకి విడుదల చేయాలని నిర్ణయం తీసుకొవడం జరిగింది. శ్యామ్‌సంగ్ విడుదల చేయనున్న ఆ మూడు 3జీ మొబైల్ ఫోన్స్ పేర్లు వరుసగా శ్యామ్‌సంగ్ ఛాంప్ 3.5జి, శ్యామ్‌సంగ్ ఛాట్ 527, శ్యామ్‌సంగ్ ప్రైమో.

శ్యామ్‌సంగ్ ఛాంప్ 3.5జి మొబైల్ ధర, ప్రత్యేకతలు:
ధర సుమారుగా రూ 5,590/-
* 2.8-inch touchscreen display
* Quad band GSM , 3G network
* Social networking
* Expandable memory
* FM Radio
* Wireless LAN Wi-Fi
* 3G connectivity
* GPRS/EDGE
* Dual camera : front and rear
* Bluetooth

శ్యామ్‌సంగ్ ఛాట్ 527 మొబైల్ ధర, ప్రత్యేకతలు:
ధర సుమారుగా: 5,930/-
* 2.4 inch LCD Display
* QWERTY Keypad
* 2 Megapixel Camera
* 80MB Internal Memory
* Expandable Memory up to 32GB
* FM Radio With RDS
* Wi-fi, Bluetooth
* 3.5mm Audio jack
* Social Networking Apps

శ్యామ్‌సంగ్ ప్రైమో మొబైల్ ధర, ప్రత్యేకతలు:
ధర సుమారుగా: 6, 590/-
* Display: 2.4 inch crisp display screen
* Camera: Dual camera
* Rear : 5MP camera with LED flash
* Front : VGA
* Multi-Format Music/Video player
* FM Radio with RDS
* 3.5 mm audio jack
* External Memory: Upto 16GB
* Wi-Fi, Bluetooth 3.0, micro USB 2.0

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot