తక్కువ ధరలో శ్యామ్‌సంగ్ డ్యూయల్ సిమ్ మొబైల్స్

Posted By: Staff

తక్కువ ధరలో శ్యామ్‌సంగ్ డ్యూయల్ సిమ్ మొబైల్స్

మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తిలో అగ్రగామి సంస్థ శ్యామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ 3 కొత్త డ్యుయల్‌ సిమ్‌ మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ మూడు మోడల్స్‌లో శ్యామ్‌సంగ్‌ స్టార్‌-2 డ్యూస్‌ (సి 6712), మెట్రో డ్యూస్‌ (సి 3322), మెట్రో సి 3752లు ఉన్నాయి. ఈ సందర్భంగా శ్యామ్‌సంగ్‌ ఎలక్ట్రానిక్స్‌కు చెందిన మొబైల్‌ అండ్‌ ఐటి కంట్రీహెడ్‌ రంజిత్‌ యాదవ్‌ మాట్లాడుతూ డ్యుయల్‌సిమ్‌ మార్కెట్‌ తమకు ఎంతో ప్రాధాన్యత ఉన్న మార్కెట్‌ అని, అందుకే తాము నిరంతరం దీనిపై దృష్టిపెట్టినట్లు వివరించారు.

శ్యామ్‌సంగ్‌ స్టార్‌-2 డ్యూస్‌ (సి 6712) ఫీచర్స్:

* 3.2 megapixel camera
* Bluetooth 3.0
* Wi-Fi connectivity
* 30 MB internal memory, 16GB expandable memory support
* 1200 mAH battery
* Native SNS, Multi IM and Push Email with ActiveSync


శ్యామ్‌సంగ్‌ మెట్రో డ్యూస్‌ (సి 3322):

* 3 megapixel camera
* 8 regional language setup
* 6cms TFT display
* 1000 mAH battery


శ్యామ్‌సంగ్‌ మెట్రో సి 3752 ఫీచర్స్:

* 5.6cm display
* EDGE, Bluetooth 2.1, WAP2.0/HTML Browser and USB 2.0
* 16GB expandable external memory
* MP3 player and FM
* 900 mAH battery


ప్రస్తుతం ఇండియన్ మొబైల్ మార్కెట్లో డ్యుయల్‌ సిమ్‌ మొబైల్స్‌కి మంచి గిరాకీ ఉండడంతో ఎక్కువ మొత్తంలో మొబైల్స్‌ని విడుదల చేయనున్నట్లు తెలిపారు. శ్యామ్‌సంగ్ పోర్ట్‌పోలియోలో 14 శ్రేణి మోడల్స్‌ ఉన్నాయి. రూ.1860 నుంచి రూ.10,990 వరకు పలు మోడల్స్‌ ఇవి లభ్యమవుతున్నాయి. ఇక శ్యామ్ సంగ్ విడుదల చేసిన స్టార్‌-2 డ్యూస్‌ (సి 6712) మొబైల్ ధర సుమారుగా రూ 6, 920 ఉండగా, మెట్రలో డ్యూస్ మొబైల్ ధర రూ 4,240, మెట్రోల సి3752 మొబైల్ ధర రూ 5,270గా నిర్ణయించడం జరిగింది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot