మెగా ఫ్యాన్స్‌కు ‘బ్రేకింగ్ న్యూస్’!

Posted By: Staff

మెగా ఫ్యాన్స్‌కు ‘బ్రేకింగ్ న్యూస్’!

మెగా‌బ్రాండ్ సామ్‌సంగ్ ‘గెలాక్సీ బీమ్ ప్రాజెక్టర్’ ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ (2012) ద్వారా పరిచయమైన ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రొజెక్టర్ ప్రత్యేకతను కలిగి ఉంటుంది. ఈ సౌలభ్యతతో మల్టీమీడియా కంటెంట్‍‌ను గోడ, సీలింగ్ తదితర చదునైన ప్రదేశాల పై ప్రదర్శించుకోవచ్చు.

గెలాక్సీ బీమ్, ఆండ్రాయిడ్ 2.3 జింజర్‌బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. పొందుపరిచిన ఇన్-బుల్ట్ 15 లూమిన్ ప్రొజెక్టర్ హైడెఫినిషన్ విజువల్స్‌ను విడుదల చేస్తుంది. ఫోన్ వెనుక భాగంలో అమర్చిన 5మెగా పిక్సల్ కెమెరా ఉత్తమ ఫోటోగ్రఫీ విలువలను కలిగి ఉంటుంది. ఏర్పాటు చేసిన 4 అంగుళాల WVGA టచ్‌స్ర్కీన్ డిస్‌ప్లే మన్నికైన విజువల్ అనుభూతులను చేరువ చేస్తుంది. హ్యాండ్‌సెట్‌లో శక్తివంతమైన 1గిగాహెట్జ్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్‌ను వినియోగించారు. ర్యామ్ సామర్ధ్యం 768ఎంబీ, ఇంటర్నల్ మెమెరీ 8జీబి, మైక్రో ఎస్‌డి కార్డ్‌స్లాట్ ద్వారా మెమెరీని 32జీబికి పెంచుకోవచ్చు. ప్రముఖ ఆన్‌లైన్ పోర్టల్ ‘సామ్‌సంగ్ ఈ-స్టోర్’ గెలాక్సీ బీమ్‌ను రూ.29,999కి ఆఫర్ చేస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot