Home
Mobile

మార్కెట్లోకి సామ్‌సంగ్ ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) ఫోన్‌

సామ్‌సంగ్ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది.

By Gizbot Bureau

సామ్‌సంగ్ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. సామ్‌సంగ్ గెలాక్సీ జే2 కోర్ (Samsung Galaxy J2 Core) పేరుతో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుంది. కేవలం గోల్డ్ కలర్ వేరియంట్‌లో మాత్రమే ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని సామ్‌సంగ్ వెల్లడించింది. ఫోన్ ధరను ఇంకా రివీల్ చేయలేదు.

గెలాక్సీ జే2 కోర్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

గెలాక్సీ జే2 కోర్ స్పెసిఫికేషన్స్ పరిశీలించినట్లయితే...

5 ఇంచ్ క్యూహెచ్‌డి టీఎఫ్టీ డిస్‌ప్లే విత్ 540x960 పిక్సల్స్ రిసల్యూషన్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో (గో ఎడిషన్) ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ క్వాడ్-కోర్ ఎక్సినోస్ 7570 ప్రాసెసర్, మాలీ-టీ70 ఎంపీఐ గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ పెంచుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 2,600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, VoLTE, 3జీ, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్).

 

 

ఫస్ట్ టైమ్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్..

ఫస్ట్ టైమ్ యూజర్లకు బెస్ట్ ఆప్షన్..

ఈ ఎంట్రీ లెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో హై-ఎండ్ డివైస్‌లలో అందుబాటులో ఉండే కీలక ఫీచర్లను అందుబాటులో ఉంచామని సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ గ్లోబల్ ప్రొడక్ట్ ప్లానింగ్, మొబైల్ కమ్యూనికేషన్స్ బిజినెస్ వైస్ ప్రెసిడెంట్ జున్హో పార్క్ తెలిపారు. మొదటి సారి స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తోన్న వారికి ఈ ఫోన్ బెస్ట్ ఛాయిస్ అని ఆయన తెలిపారు. బ్యాటరీ బ్యాకప్, స్టోరేజ్ ఇంకా పెర్ఫామెన్స్ పరంగా ప్రొఫెషనల్ క్వాలిటీ పనితీరును ఈ డివైస్ ఆఫర్ చేస్తుందని కంపెనీ తెలిపింది.

 

 

గెలాక్సీ నోట్ 8 పై భారీ ధర తగ్గింపు..

గెలాక్సీ నోట్ 8 పై భారీ ధర తగ్గింపు..

ఇదిలా ఉండగా కొద్ది రోజుల క్రితమే సామ్‌సంగ్ తన గెలాక్సీ నోట్ 9 డివై‌స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ ఫాబ్లెట్ ధర రూ.67,900గా ఉంది. సామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 9 విడుదల నేపథ్యంలో గెలాక్సీ నోట్ 8 పై భారీ ధర తగ్గింపును సామ్‌సంగ్ ప్రకటించింది. ఈ ఫాబ్లెట్ డివైస్ పై ఏకంగా రూ.12,000 ధర తగ్గింపును ప్రకటిస్తూ ఆ సంస్థ నిర్ణయం తీసుకుంది. తాజా ధర తగ్గింపు నేపథ్యంలో రూ.67,900 ఖరీదు చేసే నోట్ 8 ఫాబ్లెట్‌ను రూ.55,900కే సొంతం చేసుకునే వీలుంటుంది.

గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్..

గెలాక్సీ నోట్ 9 స్పెసిఫికేషన్స్..

6.4 ఇంచ్ క్వాడ్ హెచ్‌డీ ప్ల‌స్ సూప‌ర్ అమోలెడ్ ఇన్ఫినిటీ డిస్‌ప్లే, 2960 × 1440 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగ‌న్ 845 ప్రాసెస‌ర్‌/ఆక్టాకోర్ శాంసంగ్ ఎగ్జినోస్ 9 సిరీస్ 9810 ప్రాసెస‌ర్, 6/8 జీబీ ర్యామ్‌, 128/512 జీబీ స్టోరేజ్‌, 512 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో, సింగిల్‌/హైబ్రిడ్ డ్యుయ‌ల్ సిమ్‌, 12 మెగాపిక్స‌ల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్స‌ల్ సెల్ఫీ కెమెరా, ఐపీ 68 వాట‌ర్‌, డ‌స్ట్ రెసిస్టెన్స్‌, డాల్బీ అట్మోస్, ఎస్ పెన్‌, బారో మీట‌ర్‌, ఫింగ‌ర్‌ప్రింట్ సెన్సార్‌, హార్ట్ రేట్ సెన్సార్‌, ఐరిస్ సెన్సార్‌, ప్రెష‌ర్ సెన్సార్‌, 4జీ వీవోఎల్‌టీఈ, డ్యుయ‌ల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.0, ఎన్ఎఫ్‌సీ, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ, ఫాస్ట్ చార్జింగ్‌, వైర్‌లెస్ చార్జింగ్‌.

Best Mobiles in India

English summary
Samsung launches Galaxy J2 Core, its first Android Go phone in India.To Know More About Visit telugu.gizbot.com
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X