సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 2@రూ.20,900

Posted By:

సామ్‌సంగ్ నుంచి ఇటీవల అంతర్జాతీయ మార్కెట్లో విడుదలైన గెలాక్సీ మెగా 2 స్మార్ట్‌ఫోన్‌ను శుక్రవారం సామ్‌సంగ్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో ఆవిష్కరించింది. ధర రూ.20,900. బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంచారు. ఔత్సాహికులు గెలాక్సీ మెగా 2 స్మార్ట్‌ఫోన్‌ను నేరుగా www.samsungindiaestore.comలోకి లాగినై ఆన్‌లైన్ నగదు చెల్లింపు ద్వారా కొనుగోలు చేయవచ్చు.

 సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 2@రూ.20,900

సామ్‌సంగ్ గెలాక్సీ మెగా 2 కీలక స్పెసిఫికేషన్‌లు:

6 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ ఆటోఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2.1 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 16జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ హెచ్ఎస్ పీఏ+ 21 ఎంబీపీఎస్, వై-ఫై 802.11, బ్లూటూత్, జీపీఎస్+గ్లోనాస్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్), డ్యూయల్ సిమ్, 2800 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

గెలాక్సీ మెగా 2 స్మార్ట్‌ఫోన్‌లో ముందుగానే ఇన్‌స్టాల్ చేసిన అప్లికేషన్‌ల వివరాలు... గ్రూప్‌ ప్లే, స్టోరీ ఆల్బమ్, ఎస్‌హెల్త్ 3.0, ఎస్ వాయిస్, ఎస్ బ్రౌజర్, స్ర్ర్కీన్ మిర్రరింగ్, స్మార్ట్ స్విచ్, అల్ట్రా పవర్ సేవింగ్ మోడ్, క్విక్ కనెక్ట్.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Samsung Launches Galaxy Mega 2 With 6-Inch Display in India at Rs 20,900. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot