ఆ రోజు రానే వచ్చింది

Posted By: Prashanth

ఆ రోజు రానే వచ్చింది

 

దిగ్గజ బ్రాండ్ సామ్‌సంగ్ ప్రతిష్టాత్మకంగా లాంచ్ చేసిన ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ ‘గెలాక్సీ ఎస్3’ నేడు యూరోప్ ఇంకా మధ్యప్రాచ్య ప్రాంతంలకు చెందిన 28 దేశాల్లో విడుదల కానుంది. మే3న లండన్‌లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ హ్యాండ్‌సెట్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆపిల్ ఐఫోన్ 5 ఈ సెప్టంబర్‌లో విడుదలవుతున్న నేపధ్యంలో గెలాక్సీ ఎస్3ని ఆఘమేఘాలుగా విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ ఎస్3 విడదలను పురస్కరించుకుని బెర్లిన్ లోని కొనుగోలుదారులు సోమవారం రాత్రి నుంచే రిటైల్ స్టోర్ల వద్ద క్యూ కట్టారు. ఇండియన్ మార్కెట్లో జూన్ మొదటి వారం నుంచి గెలాక్జీ ఎస్3 విక్రయాలు జరగనున్నాయి.

నెల తిరగక ముందే 9 మిలియన్ల ప్రీఆర్డర్లు?

సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ విడుదలవుతున్న స్మార్ట్‌ఫోన్‌లు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నాయి. 2011లో విడుదలైన సామ్‌‌సంగ్ గెలాక్సీ ఎస్2, 2012 ఫిబ్రవరి నాటికి 20 మిలయన్ యూనిట్లు అమ్మకాలను క్రాస్ చేసింది. ఇండస్ట్రీలో ఈ విషక్యం నిన్న మొన్నటి వరకు సంచలనమే. ఈ సిరీస్ తాజాగా విడుదలైన గెలాక్సీ ఎస్ 3, నెల దాటక ముందే 9 మిలియన్ల యూనిట్లకు సంబంధించి ప్రీఆర్డర్లను దక్కించుకుంది!.

ఈ సమచారాన్ని స్వయానా సామ్‌సంగ్‌కు చెందిన ఓ అధికారి కొరియా ఎకనామిక్ డైలీకి వెల్లడించినట్లు తెలిసింది. గెలాక్సీ ఎస్3 అమ్మకాల విషయంలో గెలాక్సీ ఎస్2ను మించిపోవటమే కాకుండా స్మార్డ్‌ఫోన్ సెగ్మెంట్‌లో సరికొత్త రికార్డులన నెలకొల్పనుందని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు గెలాక్సీ ఎస్3కి దక్కిన 9 మిలియన్ల ప్రీ ఆర్డర్లు 145 దేశాలకు చెందిన 290 మొబైల్ ఆపరేటర్ల నుంచి వచ్చినట్లు వినికిడి. అయితే, ఈ వివరాలను సామ్‌సంగ్ వర్గాలు ధృవీకరించాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot